Friday, December 20, 2024

నేపాల్‌పై గెలిచిన భారత్…. సెమీస్ లో పాకే మన ప్రత్యర్థి?

- Advertisement -
- Advertisement -

దుబాయ్: అండర్ 19 ఆసియా కప్‌లో భాగంగా నేపాల్‌పై భారత్ జట్టు ఘన విజయం సాధించింది. పది వికెట్ల తేడాతో భారత జట్టు గెలుపొండంతో సెమీస్ చేరే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. భారత్ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. రాజ్ లింబాని అనే బౌలర్ బుల్లెట్ల లాంటి బంతులో దాడి చేయడంతో నేపాల్ 52 పరుగులకే ఆలౌటైంది. టీమిండియా బౌలర్ రాజ్ లింబానీ 9.2 ఓవర్లలో ఏడు వికెట్లు తీసి నేపాల్ వెన్నువిరించాడు. రాజ్ లింబానీ 13 పరుగులు మాత్రమే ఇచ్చారు. భారత బౌలర్లు అరాధ్య శుక్లా రెండు వికెట్లు, అర్షి కులకర్ని చెరో ఒక వికెట్ తీశారు.
52 పరుగుల లక్ష్యంతో బరిలోకి భారత జట్టు 7.1 ఓవర్లలో 57 పరుగులు చేసి ఘన విజయం సాధించింది. అర్షిన్ కులకర్ణి 30 బంతుల్లో 43 పరుగులు, ఆదర్శ్ సింగ్ 13 పరుగుల చేశారు.

గ్రూప్-ఎలో భారత్ జట్టు తొలుత ఆఫ్గానిస్తాన్ జట్టును ఓడించింది. రెండో మ్యాచ్ పాకిస్థాన్‌ చేతిలో భారత జట్టు ఓడిపోయింది. మరో మ్యాచ్ ఓడిపోతే సెమీస్ చేరే అవకాశాలు తక్కువగా ఉండడంతో నేపాల్ ఘన విజయం సాధించి సెమీస్‌కు అనధికారికంగా చేరుకుంది. గ్రూప్‌ఎలో ఇప్పటికే పాకిస్థాన్-ఆఫ్గానిస్థాన్ మ్యాచ్ జరుగుతోంది. పాక్ తొలుత బ్యాటింగ్ చేసి 48 ఓవర్లలో 303 పరుగులు చేసి ఆలౌటైంది. ఈ మ్యాచ్‌లో పాక్ గెలిస్తే సెమీస్‌లో ఆ జట్టుతో టీమిండియా తలపడనుంది. మరోసారి దాయాదుల పోరు కోసం క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News