Sunday, January 19, 2025

పాక్ పై విజయం…. భారత మహిళల శుభారంభం

- Advertisement -
- Advertisement -

దంబుల్లా: మహిళల ఆసియాకప్‌లో భారత్ శుభారంభం చేసింది. శుక్రవారం చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 19.2 ఓవర్లలో కేవలం 108 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లు అద్భుత బౌలింగ్‌తో పాక్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేయడంలో సఫలమయ్యారు.

దీప్తి శర్మ మూడు వికెట్లు తీయగా, రేణుకా సింగ్, పూజా వస్త్రకర్, శ్రేయంక పాటిల్ రెండేసి వికెట్లను పడగొట్టారు. పాక్ జట్టులో సిద్రా అమిన్ (25), తుబా హసన్ (22), ఫాతిమా సనా 22 (నాటౌట్), మునిబా అలీ (11) మాత్రమే రెండంకెల స్కోరును అందుకున్నారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన భారత్ 14.1 ఓవర్లలోనే కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఓపెనర్లు షఫాలీ వర్మ (40), స్మృతి మంధాన (45) అద్భుత బ్యాటింగ్‌తో జట్టును గెలిపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News