Sunday, December 22, 2024

రెండో టి20లో గెలిచిన టీమిండియా

- Advertisement -
- Advertisement -

పల్లెకలె: భారత్-శ్రీలంక మధ్య జరిగిన రెండో టి20లో టీమిండియా ఘన విజయం సాధించింది. లంక జట్టుపై ఏడు వికెట్ల తేడాతో భారత జట్టు గెలుపొందింది. లంక తొలుత బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసింది. ఒక మ్యాచ్ మిగిలి ఉండగా సిరీస్‌ను భారత జట్టు కైవసం చేసుకుంది. మ్యాచ్‌కు వర్షం అంతరాయం ఏర్పడడంతో డిఎల్‌ఎస్ పద్ధతి ప్రకారం 8 ఓవర్లలో 78 పరుగుల లక్ష్యాన్ని భారత జట్టు ముందు ఉంచారు. భారత్ జట్టు 6.3 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 81 పరుగులు చేసి విజయదుదుంభి మోగించింది. యశస్వి జైస్వాల్ 15 బంతుల్లో 30 పరుగులు, సూర్యకుమార్ యాదవ్ 12 బంతుల్లో 26 పరుగులు, హర్ధిక్ పాండ్యా 9 బంతుల్లో 22 పరుగులు చేశారు. ఈ మ్యాచ్ లో మూడు వికెట్లు తీసిన రవి బిష్ణోయ్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. ఈ సిరీస్ లో భారత జట్టు 2-0తో ముందంజలో ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News