Friday, November 15, 2024

అదరగొట్టిన అయ్యర్

- Advertisement -
- Advertisement -

రెండో టీ20లోనూ భారత్ విజయం
2-0తో సిరీస్ కైవసం

నేడు చివరి మ్యాచ్

ధర్మశాల : శ్రీలంకతో ధర్మశాల వేదికగా శనివారం జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించింది.శ్రేయస్ అయ్యర్ అర్ధసెంచరీకి తోడు సంజూ శాంసన్, రవీంద్ర జడేజా చెలరేగడంతో మరో నాలుగు ఓవర్లు మిగిలి ఉండగానే మూడు కోల్పోయి సిరీస్‌ను సొంతం చేసుకుంది. అంతేకాకుండా వరుసగా 11 టీ20 మ్యాచ్‌లను గెలిచిన భారత్ రికార్డు సృష్టించింది. అంతకుముందు టాస్ గెలిచిన రోహి త్ సేన ప్రత్యర్థి జట్టును బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. దీంతో లంక ఓపెనర్లు నిస్సంక, గుణతిలక నిలకడగా భారత బౌలర్లను ఎదుర్కొన్నారు. వీరిద్దరూ కలిసి తొలి వికెట్‌కు 67 పరుగులను జోడించారు. ఈ క్రమంలో రవీంద్ర జడేజా బౌలింగ్ గుణతిలక (38) క్యాచ్ అవుట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన అసలంక (2), మిషార (1), వికెట్ కీపర్ దినేష్ చండిమాల్ (9) వెనువెంటనే పెవిలియన్‌కు చేరారు. ఓవైపు వికెట్లు పడుతున్నా, మరోవైపు ఓపెనర్ నిస్సంక ధాటిగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ఈ క్రమంలోనే అర్ధ సెంచరీ నిస్సంక అర్ధ సెంచరీ సాధించాడు. కెప్టెన్ షనక కూడా క్రీజులోకి వచ్చీ రాగానే బౌండరీల మోత మోగించాడు. అయితే మరో 7బంతులు మిగిలి ఉండగా నిస్సంక (75) భువనేశ్వర్ కుమార్ బౌలింగ్ ఎల్బీగా అవుటయ్యాడు. ఇక హర్షల్ పటేల్ వేసిన చివరి ఓవర్‌లో కెప్టెన్ షనక (47, నాటౌట్) రెచ్చిపోయాడు రెండు బౌండరీలు, రెండు సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. చివరి ఓవర్‌లో భారత్ 23 పరుగులు సమర్పించుకోవడంతో శ్రీలంక నిర్ణిత ఓవర్లలో 5వికెట్లు నష్టపోయి 183 పరుగులు చేసింది. భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, బూమ్రా, హర్షల్‌పటేల్, చహల్, జడేజా తలో వికెట్ తీశారు.
తొలి ఓవర్‌లోనే వికెట్
భారీ లక్షంతో బరిలోకి దిగిన భారత్ తొలి ఓవర్‌లోనే కెప్టెన్ రోహిత్ శర్మ (1) వికెట్‌ను కోల్పోయింది. దుష్మంత చమీర బౌలింగ్‌లో రోహిత్ ముందు దొరికిపోయాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే ఇషాన్ కిషన్ (16) కుమార బౌలింగ్‌లో షనకకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అయితే లక్షం ఉన్నా శ్రేయాస్ అయ్యర్, మరో యువ బ్యాట్స్‌మన్ సంజూ శాంసన్‌తో కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. వీరిద్దరూ కలిసి మూడో వికెట్‌కు కీలకమైన 75 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. ఈ క్ర మంలో సంజూ శాంసన్ (39) అవు టయ్యాడు. ఆ తర్వాత వచ్చిన ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాతో జతకట్టిన అయ్యర్ (69) అర్ధ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. మరోవైపు జడేజా సైతం 15 బంతుల్లోనే ఆరు బౌండరీలు, ఒక సిక్సర్‌తో చెలరేగడంతో భారత్ కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి మరో నాలుగు ఓవర్లు మిగిలి ఉండగానే విజయం సాధించి సిరీస్‌ను 2-0 చేసుకుంది. ఇక చివరిదైనా మూడో టీ20 మ్యాచ్ ఆదివారం జరగనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News