Wednesday, January 15, 2025

టీమిండియా బోణీ

- Advertisement -
- Advertisement -

తొలి టి20లో లంకపై గెలుపు
పల్లెకెలె: శ్రీలంకతో శనివారం జరిగిన తొలి టి20లో టీమిండియా 43 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో భారత్ మూడు మ్యాచ్‌ల సిరీస్ 1-0 ఆధిక్యాన్ని అందుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్ జట్టుకు మెరుపు ఆరంభాన్ని అందించారు.

యశస్వి 21 బంతుల్లో 5 ఫోర్లు, రెండు సిక్సర్లతో 40 పరుగులు చేశాడు. గిల్ ఆరు ఫోర్లు, ఒక సిక్స్‌తో 34 పరుగులు సాధించాడు. ఇద్దరు తొలి వికెట్‌కు ఆరు ఓవర్లలోనే 74 పరుగులు జోడించారు. ఇక సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడాడు. చెలరేగి ఆడిన సూర్యకుమార్ 26 బంతుల్లోనే 8 ఫోర్లు, రెండు సిక్స్‌లతో 58 పరుగులు చేశాడు. పంత్ (49) తనవంతు పాత్ర పోషించాడు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన లంక 19.2 ఓవర్లలో 170 పరుగులకే కుప్పకూలింది. రియాన్ పరాగ్ మూడు వికెట్లు తీశాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News