ట్రినిడాడ్: క్వీన్స్ పార్క్ ఓవల్ మైదానంలో జరిగిన మూడో వన్డేలో వెస్టిండీస్‌పై టీమిండియా గెలవడంతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. భారత జట్టు 3-0 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. మూడో వన్డేలో శుభమన్(98), శిఖర్ ధావన్ (58) హాఫ్ సెంచరీలతో అదరగొట్టారు. వర్షం అంతరాయం ఏర్పడడంతో భారత జట్టు 36 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 225 పరుగులు చేసింది. డక్ వర్త్ లూయిస్ ప్రకారం వెస్టిండీస్ 35 ఓవర్లలో 257 పరుగులు నిర్ధారించారు. కానీ వెస్టిండీస్ 26 ఓవర్లలో 137 పరుగులు చేసి ఆలౌటైంది. మహ్మాద్ సిరాజ్, చాహల్ ధాటికి విండీస్ బ్యాట్స్‌మెన్లు విలవిలలాడిపోయారు. భారత్ బౌలర్లలో యుజేంద్ర చాహల్ నాలుగు వికెట్లు పడగొట్టగా సిరాజ్, శార్థూల్ టకూర్ చెరో రెండు వికెట్లు, అక్షర పటేల్, ప్రసిద్ధ క్రిష్ణ చెరో ఒక వికెట్ తీశారు. ఈ సిరీస్ లో శుభ్‌మన్ గిల్ 205 పరుగుల చేయడంతో మ్యాన్ ఆఫ్ ది సిరీస్ దక్కింది. మూడో వన్డేలో 98 పరుగులు చేయడంతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గిల్ కే వరించింది.
మూడో వన్డే భారత్‌దే… సిరీస్ కైవసం…
- Advertisement -
- Advertisement -
- Advertisement -