Sunday, January 12, 2025

ఐదో వన్డేలో గెలుపు….. భారత్‌కే సిరీస్

- Advertisement -
- Advertisement -

 

ఫ్లోరిడా: భారత్-వెస్టిండీస్ మధ్య జరుగుతున్న ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత జట్టు 4-1 తేడాతో సీరిస్‌ను కైవసం చేసుకుంది. సెంట్రల్ బ్రోవార్డ్ రీజియనల్ పార్క్ స్టేడియం టర్ఫ్ స్టేడియంలో ఐదు వన్డేలో విండీస్ పై భారత జట్టు గెలిచింది. భారత్ నిర్దేషించిన 189 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ జట్టు 100 పరుగులు చేసి ఆలౌటైంది. భారత స్పినర్ల ధాటికి విండీస్ విలవిలలాడింది. విండీస్ బ్యాట్స్‌మెన్లలో శిమ్రాన్ హెట్‌మెయిర్ ఒక్కడే హాఫ్ సెంచరీతో కదంతొక్కాడు. మిగితా బ్యాట్స్‌మెన్లు సింగల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. టీమిండియా బౌలర్లలో రవి బిష్ణోయ్ నాలుగు వికెట్లు పడగొట్టగా కుల్దీప్ యాదవ్, అక్షర పటేల్ చెరో మూడు వికెట్లు తీశారు. స్పినర్లు పది వికెట్లు తీసి రికార్డు సృష్టించారు. అక్షర్ పటేల్ మెయిన్ బ్యాట్స్‌మెన్లను ఔట్ చేయడంతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. అర్షదీప్ సింగ్ ఈ సిరీస్ లో ఏడు వికెట్లు తీయడంతో ప్లేయర్ ఆప్ సిరీస్ దక్కింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News