Monday, December 23, 2024

మూడో టి20లో గెలిచిన భారత్

- Advertisement -
- Advertisement -

హరారే: హరారే స్పోర్ట్స్ క్లబ్ మైదానంలో భారత్-జింబాబ్వే మధ్య జరుగుతున్న మూడో టి20లో టీమిండియా ఘన విజయం సాధించింది. జింబాబ్వేపై భారత్ 23 పరుగుల తేడాతో గెలిచింది. జింబాబ్వే 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. భారత్ తొలుత బ్యాటింగ్ చేసి జింబాబ్వే ముందు 183 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. డెయిన్ మేయిర్స్ హాఫ్ సెంచరీతో(66) చెలరేగాడు.  క్లీవ్ మదండే 37 పరుగులు చేసి పర్వాలేదనిపించారు. జింబాబ్వే బ్యాట్స్ మెన్లు వెల్లింగ్ టన్ (18), సికిందర్ రాజా(15), మిగిలిన వారు సింగిల్ డిజిట్ కే పరిమితం కావడంతో ఆ జట్టు ఓటమిని చవిచూసింది. వాషింగ్టన్ సుందర్ మూడు వికెట్లు, అవేశ్ రెండు వికెట్లు తీసి జింబాబ్వే నడ్డి విరిచాడు. ఖలీల్ అహ్మద ఒక వికెట్ తీశాడు. ఈ సిరీస్ లో 2-1 తేడాతో భారత్ ముందంజలో ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News