Friday, January 17, 2025

ఐదో టెస్టులోనూ మనదే గెలుపు

- Advertisement -
- Advertisement -

ఇంగ్లండ్ తో జరిగిన టెస్ట్ సీరీస్ ను టీమిండియా 4-1తో కైవసం చేసుకుంది. చివరి టెస్టులో ఇంగ్లండ్ ను ఇన్నింగ్స్, 64 పరుగుల తేడాతో ఓడించింది. మొదటి ఇన్నింగ్స్ లో కులదీప్ యాదవ్, రెండో ఇన్నింగ్స్ లో అశ్విన్ ఇంగ్లండ్ వెన్ను విరిచారు. ఇంగ్లండ్ బ్యాటర్ జో రూట్ (84) చివరివరకూ ఒంటరిపోరాటం చేశాడు. మిగిలిన బ్యాటర్లందరూ వరుసగా పెవిలియన్ బాట పట్టారు.

మొదటి ఇన్నింగ్స్ లో తడబడిన ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ లోనూ అదే తీరు కనబరచింది. ధర్మశాలలో టీమిండియాతో జరిగిన ఐదో టెస్ట్ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ 195 పరుగులకు ఆలౌట్ అయింది.

ఇన్నింగ్స్ ఆరంభంలోనే ఓపెనర్ జాక్ క్రాలే డకౌట్ అయ్యాడు. మరో ఓపెనర్ డకెట్ రెండే రెండు పరుగులు చేసి పెవిలియన్ బాట పట్టాడు. వన్ డౌన్ లో వచ్చిన ఓలీ పోప్ 19 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ మూడు వికెట్లూ అశ్విన్ కే దక్కడం విశేషం. ఇక కులదీప్ యాదవ్ బౌలింగ్ లో బెయిర్ స్టో ఎల్ బి డబ్ల్యుగా వెనుదిరిగాడు. కెప్టెన్ బెన్ స్టోక్స్ సైతం రెండు పరుగులు చేసి అశ్విన్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఎనిమిది పరుగులు చేసిన బెన్ ఫోక్స్ ను అశ్విన్ క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత టామ్ హర్ట్ లీ, మార్క్ ఉడ్ లను బుమ్రా ఎల్ బీడబ్ల్యుగా ఔట్ చేసి, పెవిలియన్ దారి పట్టించాడు. చివరలో షోయబ్ బషీర్ క్రీజులో పాతుకుపోయి, జో రూట్ కు అండగా నిలిచాడు. ఈ జంటను రవీంద్ర జడేజా విడదీశాడు. 13 పరుగులు చేసిన బషీర్ ను జడేజా క్లీన్ బౌల్డ్ చేశాడు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News