రాణించిన బౌలర్లు, మెరిసిన శ్రేయస్, లంకపై భారత్ ఘన విజయం
ధర్మశాల: శ్రీలంకతో ఆదివారం జరిగిన మూడో టి20లో టీమిండియా ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో భారత్ సిరీస్‌ను 30 తేడాతో క్లీన్‌స్వీప్ చేసింది. ఇక టి20లో భారత్‌కు ఇది వరుసగా 12వ విజయం కావడం విశేషం. ఇదే సమయంలో అఫ్గానిస్థాన్ పేరిట ఉన్న 12 వరుస విజయాల రికార్డును టీమిండియా సమం చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. తర్వాత లక్షఛేదనకు దిగిన టీమిండియా 16.5 ఓవర్లలోనే కేవలం నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. కెప్టెన్ రోహిత్ శర్మ (5) ఆరంభంలోనే వెనుదిరిగాడు.
అయితే అద్భుత ఫామ్‌లో ఉన్న శ్రేయస్ అయ్యర్ మరోసారి చెలరేగి పోయాడు. ఓపెనర్ సంజూ శాంసన్ (18), దీపక్ హుడా (21), వెంకటేశ్ అయ్యర్ (5) ఎక్కువ సేపు క్రీజులో నిలువలేక పోయారు. అయితే రవీంద్ర జడేజా 22 (నాటౌట్) అండతో శ్రేయస్ మరో వికెట్ కోల్పోకుండానే భారత్‌ను గెలిపించాడు. శ్రేయస్ 45 బంతుల్లోనే 9 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 73 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన లంకకు ఆరంభంలోనే కష్టాలు మొదలయ్యాయి. అవేశ్ ఖాన్, సిరాజ్‌లు అద్భుత బౌలింగ్‌తో లంక బ్యాట్స్‌మెన్‌ను హడలెత్తించారు. అయితే చివర్లో కెప్టెన్ శనకా 74 (నాటౌట్) చిరస్మరణీయ ఇన్నింగ్స్‌తో లంకను ఆదుకున్నాడు.