- Advertisement -
కౌలాలంపూర్: మహిళల అండర్ 19 టి20 వరల్డ్ కప్‌ను భారత్ గెలుచుకుంది. ఫైనల్ మ్యాచ్‌లో సౌతాఫ్రికాపై భారత్ ఘన విజయం సాధించింది. సపారీలపై తొమ్మిది వికెట్ల తేడాతో టీమిండియా గెలిచింది. దక్షిణాఫ్రికా జట్టు తొలుత బ్యాటింగ్ చేసి 83 పరుగుల లక్ష్యాన్ని భారత జట్టు ముందు ఉంచింది. టీమిండియా 11.2 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 84 పరుగులు చేసింది. కమలిని ఎనిమిది పరుగులు చేసి కయ్ల బౌలింగ్‌లో సిమోన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగింది. గొంగడి త్రిష(44), సనికా చాకీ (26) పరుగులు చేసి విజయాన్నందించారు. గొంగడి సునీతో మూడు వికెట్లు తీయడంతో 44 పరుగులు చేయడంతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. టి20 వరల్డ్ కప్ లో త్రిష 451 పరుగులు చేయడంతో ఏడు వికెట్లు తీసింది. దీంతో ఆమెకు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ కూడా వచ్చే అవకాశం ఉంది.
- Advertisement -