Monday, December 23, 2024

చివరి టి20లోనూ భారత్ ఘన విజయం

- Advertisement -
- Advertisement -

చెలరేగిన ముఖేష్..
42 పరుగుల తేడాతో జింబాబ్వే చిత్తు
41తో సిరీస్ టీమిండియా కైవసం

హరారే : టీమిండియా జింబాబ్వే పర్యటనను విజయంతో ముగించింది. తొలి టి20లో ఓడిన భారత్ వరుస నాలుగు టి20ల్లోనూ ఘన విజయం సాధించి 41తో సిరీస్ కైవసం చేసుకుంది. ఐదు టి20ల సిరీస్‌లో భాగంగా ఆదివారం జరిగిన ఆఖరి మ్యాచ్‌లో 42 పరుగుల తేడాతో జింబాబ్వేను చిత్తు చేసింది. యువ పేసర్ ముఖేష్ కుమార్(4/22) బాల్‌తో చెలరేగడంతో ఆఖరి మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 167 పరుగులు చేసింది. లక్ష ఛేదనకు దిగిన జింబాబ్వే 124 పరుగులకే ఆలౌట్ అయ్యింది. మరుమని(27), డైయాన్ మేయర్(34), ఫరాజ్ ఆక్రమ్(27)లు మాత్రమే రాణించారు. భారత్ బౌలర్ల దాటికి మిగతా వారెవరూ క్రీజులలో నిలవలేక పోయారు.

ఆదుకున్న శామ్‌సన్..

అంతకుముందు బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు శుభారంభం దక్కలేదు. తొలి ఓవర్‌లోనే యశస్వి జైస్వాల్ క్యాచ్ ఔట్ అయ్యాడు. అతను 5 బంతుల్లో 12 పరుగులు చేశాడు. నాలుగో ఓవర్లో అభిషేక్ శర్మ వికెట్ కోల్పోయాడు. అతను 11 బంతుల్లో 14 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ భారీ స్కోరు చేయడంలో విఫలమై 14 బంతుల్లో 13 పరుగులు చేశాడు. అనంతరం రియాన్ పరాగ్‌తో కలిసి సంజూ శాంసన్ నాలుగో వికెట్‌కు 65 పరుగులు జోడించారు.

రియాన్ పరాగ్ 24 బంతుల్లో 22 పరుగులు, సంజూ శాంసన్ 45 బంతుల్లో 58 పరుగులు చేశారు. తుఫాను ఇన్నింగ్స్ ఆడుతున్న శివమ్ దూబే రనౌట్ అయ్యాడు. 12 బంతుల్లో 26 పరుగులు చేశాడు. రింకూ సింగ్ 11 పరుగులతో, వాషింగ్టన్ సుందర్ 1 పరుగుతో నాటౌట్‌గా నిలిచారు. జింబాబ్వే బౌలింగ్‌లో బ్లెస్సింగ్, ముజారబానీ రెండేసి వికెట్లు దక్కించుకోగా.. కెప్టెన్ సికందర్ రజా, రిచర్డ్ నగరవ, బ్రాండన్ మవుటా తలో వికెట్ పడగొట్టారు.

జైశ్వాల్ నయా చరిత్ర..

టీమిండియా స్టార్ బ్యాటర్ యశస్వి జైస్వాల్ నయా చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ టి20ల్లో ఓ కొత్త రికార్డును నమోదు చేశాడు. టి20 మ్యాచ్‌లో తొలి బంతికే 13 పరుగులు రాబట్టిన మొదటి బ్యాటర్‌గా చరిత్రయ నెలకొల్పాడు. ఈ మ్యాచ్‌లో భరత్ తొలుద బ్యాటింగ్ చేయగా.. ఓపెనర్లుగా యశస్వి జైశ్వాల్, శుభ్‌మన్ గిల్‌లు బ్యాటింగ్ దిగారు. ఇక తొలి ఓవర్‌ను జింబాబ్వే కెప్టెన్ సికందర్ రాజా వేసాడు.

ఫస్ట్ బాల్‌ను అతను నోబాల్‌గా వేయగా.. యశస్వి జైస్వాల్ సిక్స్ బాదాడు. ఓవర్ డీప్ స్క్వేర్ లెగ్ దిశగా బౌండరీ దాటించాడు. నడుము కంటే ఎత్తులో ఈ బంతి రావడంతో అంపైర్ నోబాల్(ఫ్రీ హిట్)గా ప్రకటించాడు. అయితే మరుసటి బంతిని జైస్వాల్.. బ్యాక్‌ఫుట్‌లో స్ట్రైట్‌గా సిక్సర్ తరలించాడు. దీంతో ఒక్క బంతికే భారత్‌కు 13 పరుగులు లభించాయి. ఈ ఘనత సాధించిన తొలి బ్యాటర్‌గా యశస్వి జైస్వాల్ చరిత్రకెక్కాడు. 21 ఏళ్ల టీ20 క్రికెట్ చరిత్రలో ఇప్పటి వరకు ఏ బ్యాటర్ కూడా ఈ ఫీట్ సాధించలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News