Monday, January 20, 2025

టీమిండియా వరల్డ్‌కప్ జెర్సీ ఆవిష్కరణ

- Advertisement -
- Advertisement -

ముంబై: సొంత గడ్డపై జరిగే వన్డే ప్రపంచకప్ కోసం టీమిండియా కొత్త జెర్సీని రూపొందించారు. భారత క్రికెట్ టీమ్ ఆఫీషియల్ జెర్సీ స్పాన్సర్ అడిడాస్ సంస్థ బుధవారం కొత్త జెర్సీని ఆవిష్కరించింది. ఇందుకు సంబంధించిన ఓ వీడియోను అడీడాస్ సంస్థ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇది ప్రస్తుతం వైరల్‌గా మారింది. కెప్టెన్ రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్య, స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి, సీనియర్ బౌలర్ కుల్దీప్ యాదవ్ కొత్త జెర్సీలో కనిపించారు.

బైజూస్ స్థానంలో కొన్ని రోజుల క్రితమే అడీడాస్ సంస్థ టీమిండియా జెర్సీ స్పాన్సర్‌గా ఎంపికైన విషయం తెలిసిందే. ఇక అడీడాస్ సంస్థ స్పాన్సర్‌గా వచ్చిన తర్వాత పలుసార్లు టీమిండియా జెర్సీల్లో మార్పులు చేస్తూ వస్తోంది. తాజాగా సొంత గడ్డపై జరుగుతున్న వరల్డ్‌కప్ కోసం కూడా కొత్త జెర్సీని రూపొందించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News