- Advertisement -
లండన్: భారత్‌లో జరిగే పురుషుల టంటీ20 ప్రపంచకప్‌లో టీమిండియాకే ట్రోఫీ సాధించే అవకాశాలు అధికంగా ఉన్నాయని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైక్ అథర్టన్ జోస్యం చెప్పాడు. ఇంగ్లండ్ వంటి బలమైన జట్టును ఓడించి టి20 సిరీస్‌ను గెలుచుకున్న టీమిండియా ఆత్మవిశ్వాసం రెట్టింపు అయిందనడంలో సందేహం లేదన్నాడు. దీనికి తోడు సొంత గడ్డపై ఆడనుండడం భారత్‌కు మరింత ప్రయోజనం కలిగించే అంశమన్నాడు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే ఆటగాళ్లకు భారత్‌లో కొదవలేదన్నాడు. ఐపిఎల్‌లో ఆడడం ద్వారా వారు మరింత రాటుదేలారన్నాడు. ఇలాంటి స్థితిలో భారత్‌కే ట్రోఫీ అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయన్నాడు. కానీ ట్రోఫీని సాధించాలంటే ఇంగ్లండ్, వెస్టిండీస్, న్యూజిలాండ్ వంటి బలమైన జట్లను ఓడించాల్సి ఉంటుందని అథర్టన్ పేర్కొన్నాడు.
- Advertisement -