హైదరాబాద్: టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు టి20 వరల్డ్ కప్‌లో ప్రముఖ పాత్ర పోషిస్తారని మాజీ క్రికెటర్ నవ్‌జ్యోత్ సిద్ధూ తెలిపాడు. క్లాస్ ఆటతీరుతో విరాట్ తనదైన ముద్ర వేశాడని, అతడి వయసు పెరిగే కొద్దీ మరింత పిట్‌గా తయారవుతున్నాడని ప్రశంసించారు. మూడు ఫార్మాట్లలో విరాట్, రోహిత్ రాణించే సత్తా ఇంకా ఉందని మెచ్చుకున్నారు. హిట్‌మ్యాన్ ఫిట్‌నెస్ గురించి తనకు తెలియదు కానీ వయుసు పెరిగే కొద్దీ దూకుడు మాత్రం తగ్గడం లేదని, ఇద్దరు నాణ్యమైన బ్యాట్స్‌మెన్లు కొనియాడారు. గతంలో సెహ్మాగ్ కూడా చివరి వరకు దూకుడు ఆటతీరును ప్రదర్శించిన విషయాన్ని గుర్తు చేశారు. టి20 మ్యాచ్‌లలో టాప్ ప్లేయర్ల అవసరం ఉందని, ఫామ్ అనేది ఉదయం వేళ వచ్చే మంచులాంటిదని, అది త్వరగానే పోతుందని పేర్కొన్నాడు.
గత కొన్ని సంవత్సరాలు తాను క్రికెట్‌తో టచ్‌లో లేనప్పటికి చాలా నిశితంగా గమనిస్తున్నానని, వన్డే ప్రపంచ కప్‌లో భారత్ అద్భుతంగా ఆడిందని, ఒక్క బ్యాడ్ గేమ్‌తో వరల్డ్ కప్‌ను వదులుకోవాల్సి వచ్చిందన్నారు. జట్టు భవిష్యత్తును ఇప్పుడు అంచనా వేయడం సరికాదని, క్రికెట్‌పై టీమిండియా ఆధిపత్యం ప్రదర్శించడానిక కారణం వ్యవస్థ బలంగా ఉండటమేనని చెప్పుకొచ్చారు. తాము ఆడుతున్న రోజుల్లో ఎవరు ఫామ్ కోల్పోయిన పెద్ద సమస్య వచ్చేది కాదని, గేమ్‌లోనే ఉండేవారమని, ఇప్పుడు తీవ్రమైన పోటీ రావడంతో ఒక్క సారి ఫామ్ కోల్పోతోనే జట్టులోకి రావడం కష్టంగా మారిందన్నారు. ముంబయి ఇండియన్స్ కెప్టెన్ హార్ధిక్ పాండ్యా మెరుగైన ప్రదర్శన చేస్తే టీమిండియాకు కెప్టెన్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయన్నారు.
టీమిండియా భవిష్యత్‌ను ఇప్పుడు అంచనా వేయలేం: సిద్ధూ
- Advertisement -
- Advertisement -
- Advertisement -