Thursday, January 23, 2025

టీమిండియా అరుదైన రికార్డు..

- Advertisement -
- Advertisement -

Team India's huge milestone for its 1000th ODI Match

అహ్మదాబాద్: ప్రపంచ క్రికెట్‌లోనే అత్యంత అరుదైన రికార్డుకు టీమిండియా చేరువైంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ క్రికెట్ స్టేడియంలో ఆదివారం వెస్టిండీస్‌తో జరిగే తొలి వన్డే భారత్‌కు ప్రత్యేకంగా మారనుంది. టీమిడియా క్రికెట్ చరిత్రలో ఇది 1000వ వన్డే మ్యాచ్ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. అంతేగాక వన్డే క్రికెట్‌లో 1000వ వన్డే మ్యాచ్‌లను పూర్తి చేసుకున్న తొలి జట్టుగా భారత్ నిలువనుంది. ఇప్పటి వరకు ఏ జట్టు కూడా వన్డే చరిత్రలో ఇన్ని మ్యాచ్‌లు ఆడలేదు. భారత్ తర్వాత ఆస్ట్రేలియా 958 వన్డేలతో రెండో స్థానంలో నిలువనుంది. పాకిస్థాన్ 936 వన్డేలతో మూడో స్థానంలో కొనసాగుతోంది. ఇక భారత్ ఇప్పటి వరకు 999 వన్డే మ్యాచ్‌లు ఆడింది. ఇందులో 518 వన్డేల్లో విజయం సాధించింది. మరో 431 మ్యాచుల్లో ఓటమి పాలైంది. మరోవైపు భారత్ చారిత్రక మ్యాచ్‌కు రోహిత్ శర్మ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. అయితే కరోనా భయం వెంటాడుతుండడంతో వన్డే సిరీస్‌ను ఖాళీ స్టేడియంలోనే నిర్వహిస్తున్నారు. దీంతో చారిత్రక మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూడాలని భావించిన అభిమానులకు నిరాశ మిగిలింది. 1974లో భారత్ తొలి వన్డే ఆడింది. తొలి వన్డే కెప్టెన్‌గా అజిత్ వాడేకర్ వ్యవహరించారు. 500వ వన్డేకు సౌరవ్ గంగూలీ కెప్టెన్‌గా ఉన్నాడు. తాజాగా 1000వ వన్డే మ్యాచ్‌కు రోహిత్ శర్మ సారథ్యం వహించనున్నాడు.

Team India’s huge milestone for its 1000th ODI Match

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News