Friday, December 20, 2024

అమితాబ్ బచ్చన్‌కు ‘కల్కి 2898 AD’ టీమ్ పుట్టినరోజు శుభాకాంక్షలు

- Advertisement -
- Advertisement -

ప్రభాస్, నాగ్ అశ్విన్, వైజయంతి మూవీస్ మ్యాసీవ్ కాంబినేషన్ లో రూపొందుతున్న లార్జ్ దెన్ లైఫ్, మైథాలజీ ఇన్స్పైర్డ్ ఫ్యుచరిస్ట్ సైన్స్ ఫిక్షన్ గ్లోబల్ ఫిల్మ్ ‘కల్కి 2898 AD’. ఆసక్తికరమైన పోస్టర్ ద్వారా కల్కి 2898 AD యూనిట్, బి అమితాబ్ బచ్చన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసింది.

పోస్టర్ లో అమితాబ్ బచ్చన్ ఒక గుహలో తన ముఖాన్ని గుడ్డతో కప్పి, చేతిలో కర్రతో నిలబడి ఉన్న సాధువుగా కనిపించారు. అతని కళ్ళను చూడగలిగినప్పటికీ ఫెరోషియస్ కనిపిస్తున్నారు. బిగ్ బి కీలక పాత్ర పోహిస్తున్న ఈ చిత్రంలో కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటాని కూడా ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ఈ చిత్రం ఫస్ట్ గ్లింప్స్ 2023 శాన్ డియాగో కామిక్-కాన్‌లో లాంచ్ చేశారు. ఫస్ట్ గ్లింప్స్ కి  ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన స్పందన లభించింది. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్విన్ దత్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని 2024 ప్రథమార్థంలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News