Thursday, January 23, 2025

మహారాష్ట్ర స్పీకర్ ను ఎన్నుకోవడంలో షిండే వర్గం గెలుపు!

- Advertisement -
- Advertisement -

 

Maharashtra speaker elected

ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీలో తన మెజారిటీని నిరూపించుకోవడానికి ఓటింగ్‌కు ఒకరోజు ముందు, ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే శిబిరం ఆదివారం భారీ విజయాన్ని సాధించింది.  స్పీకర్ గా తమ అభ్యర్థిని ఎన్నుకుంది. మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌ను ఎన్నుకునే ఓటింగ్…  హెడ్ కౌంట్ ద్వారా జరగడంతో బిజెపి శాసనసభ్యుడు రాహుల్ నార్వేకర్ 164 ఓట్లతో  మెజారిటీ మార్కును సులభంగా అధిగమించారు.  ఉద్ధవ్ ఠాక్రే జట్టులోని శివసేన ఎమ్మెల్యే రాజన్ సాల్వీకి  107 ఓట్లు వచ్చాయి.

దీనికి ముందు శివసేనలోని రెండు వర్గాలు…ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని వర్గం, ఏక్ నాథ్ షిండే నేతృత్వంలోని వర్గం తమతమ అభ్యర్థికే ఓటేయాలని విప్ లు జారీచేశాయి. 2021 ఫిబ్రవరిలో కాంగ్రెస్‌కు చెందిన నానా పటోలే తన పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా రాజీనామా చేసినప్పటి నుంచి అసెంబ్లీ స్పీకర్ పదవి ఖాళీగా ఉంది. డిప్యూటీ స్పీకర్ నరహరి జిర్వాల్ తాత్కాలిక స్పీకర్‌గా విధులు నిర్వహిస్తున్నారు.

రాష్ట్రంలో తాజా పరిణామాల దృష్ట్యా అసెంబ్లీ స్పీకర్ పదవికి ఎన్నిక కీలకం. కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన ఏక్‌నాథ్ షిండే సహా 16 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలపై అనర్హత వేటును స్పీకర్ కొట్టివేయవచ్చని న్యాయ నిపుణులు అంటున్నారు. వీరిపై అనర్హత వేటు వేస్తూ డిప్యూటీ స్పీకర్ నరహరి జిర్వాల్ గత నెలలో నోటీసులు జారీ చేశారు.

ఇంకా, షిండే వర్గాన్ని “నిజమైన” శివసేనగా స్పీకర్ గుర్తిస్తే, ఆ గ్రూపు మరే ఇతర రాజకీయ పార్టీలో విలీనం కావాల్సిన అవసరం లేదని నిపుణులు అంటున్నారు. తనకు 2/3వ వంతు మెజారిటీ ఉన్నందున తాను సేన లెజిస్లేచర్ పార్టీ నాయకుడిని అని ఏకనాథ్ షిండే వాదించారు.

ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వం సోమవారం అసెంబ్లీలో బలపరీక్షను ఎదుర్కోనుంది. అస్సాం నుంచి తిరిగి వచ్చిన తర్వాత గోవా హోటల్‌లో బస చేసిన 39 మంది సేన తిరుగుబాటుదారులతో సహా 50 మంది ఎమ్మెల్యేలతో కలిసి షిండే నిన్న సాయంత్రం ముంబైకి చేరుకున్నారు.

శుక్రవారం నాడు, శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే “పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు” పాల్పడినందుకు షిండేను పార్టీ నాయకుడి పదవి నుంచి  తొలగించారు. ఇప్పుడు ‘నిజమైన’ శివసేన నిర్ణయాన్ని సవాలు చేస్తామని షిండే వర్గం అంటోంది. ఇదిలావుండగా గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ ఆదేశించిన సభలో అవిశ్వాస తీర్మానంపై స్టే విధించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించడంతో ఉద్ధవ్ ఠాక్రే బుధవారం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News