Saturday, January 25, 2025

కోహ్లి ఒంటరి పోరాటం

- Advertisement -
- Advertisement -

TeamIndia 223 in first innings against South africa

చెలరేగిన రబాడ, జాన్‌సెన్, భారత్ 223 ఆలౌట్, సౌతాఫ్రికా 17/1

కేప్‌టౌన్: సౌతాఫ్రికాతో మంగళవారం ప్రారంభమైన మూడో చివరి టెస్టులో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 223 పరుగులకు ఆలౌటైంది. తర్వాత మొదటి ఇన్నింగ్స్ చేపట్టిన ఆతిథ్య దక్షిణాఫ్రికా తొలి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుడా 206 పరుగులు చేసింది. డీన్ ఎల్గర్ (3)ను బుమ్రా వెనక్కి పంపాడు. ఐడెన్ మార్‌క్రామ్ (8), కేశవ్ మహారాజ్ (6) క్రీజులో ఉన్నారు. ఇక భారత్ తొలి ఇన్నింగ్స్ స్కోరును అందుకోవాలంటే సౌతాఫ్రికా మరో 206 పరుగులు చేయాలి.

ఆరంభంలోనే..

అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్లు కెఎల్.రాహుల్, మయాంక్ అగర్వాల్‌లు మరోసారి నిరాశ పరిచారు. రాహుల్ 12 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. ఆ వెంటనే మయాంక్ అగర్వాల్ కూడా వెనుదిరిగాడు. మూడు ఫోర్లతో 15 పరుగులు చేసిన అతన్ని రబాడ వెనక్కి పంపాడు. దీంతో భారత్ 33 పరుగులకే ఓపెనర్ల వికెట్లను కోల్పోయింది.

పుజారా, కోహ్లి పోరాటం..

ఈ దశలో చటేశ్వర్ పుజారా, కెప్టెన్ విరాట్ కోహ్లి సమన్వయంతో ఇన్నింగ్స్‌ను కుదుట పరిచాడు. పుజారా ధాటిగా ఆడగా కోహ్లి డిఫెన్స్‌కే పరిమితమయ్యాడు. ఇద్దరు ప్రత్యర్థి బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ ముందుకు సాగారు. ఈ జోడీని విడగొట్టేందుకు సౌతాఫ్రికా బౌలర్లు చాలా సేపటి వరకు నిరీక్షించాల్సి వచ్చింది. పుజారా, కోహ్లి కుదరుగా ఆడడంతో భారత్ లంచ్ విరామ సమయానికి మరో వికెట్ నష్టపోకుండా 75 పరుగులు చేసింది. ఆ తర్వాత పుజారా ఔటయ్యాడు. ధాటిగా ఆడుతున్న పుజారాను జాన్‌సెన్ వెనక్కిం పంపాడు. కీలక ఇన్నింగ్స్ ఆడిన పుజారా 77 బంతుల్లో ఏడు ఫోర్లతో 43 పరుగులు చేశాడు. ఇక జట్టును ఆదుకుంటాడని భావించిన సీనియర్ ఆటగాడు అజింక్య రహానె నిరాశ పరిచాడు. రెండు ఫోర్లతో 9 పరుగులు చేసి రబాడ బౌలింగ్‌లో వెనుదిరిగాడు.

ఒకవైపు వికెట్లు పడుతున్నా కెప్టెన్ కోహ్లి ఒంటరి పోరాటం చేశాడు. అతనికి రిషబ్ పంత్ అండగా నిలిచాడు. ప్రత్యర్థి బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న పంత్ 4 ఫోర్లతో 27 పరుగులు చేసి ఔటయ్యాడు. తర్వాత వచ్చిన రవిచంద్రన్ అశ్విన్ (2), శార్దూల్ ఠాకూర్ (12), బుమ్రా (0) కూడా వెంటవెంటనే పెవిలియన్ చేరారు. ఒంటరి పోరాటం చేసిన కెప్టెన్ విరాట్ కోహ్లి 201 బంతుల్లో 12 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 79 పరుగులు చేసి రబాడ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. షమి (7)ను ఎంగిడి ఔట్ చేయడంతో భారత్ 77.3 ఓవర్లలో 223 పరుగుల వద్ద ముగిసింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News