Sunday, December 22, 2024

శంభు సరిహద్దులో రైతులపై టియర్ గ్యాస్ ప్రయోగం….

- Advertisement -
- Advertisement -

దేశ రాజధాని ఢిల్లీ శివారులో నిరసన తెలుపుతున్న రైతుల పైకి భద్రతా బలగాలు, పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు. శంభు సరిహద్దులో బుధవారం తమపై టియర్ గ్యాస్ ప్రయోగించారని రైతులు తెలిపారు. హర్యానా నుంచి ఢిల్లీ వచ్చే రహదారులను ముళ్ల కంచెలతో మూసివేశారు. నగరంలోకి ప్రవేశించే మార్గాలను సిమెంట్ బ్యారికేడ్లతో ముళ్ల కంచెలను ఏర్పాటు చేశారు. రైతులను నిలువరించేందకు కొన్ని కాంక్రీటు దిమ్మెలు, ఇనుప కంచెలు, మేకులు, కంటైనర్లతో రెండు మూడు అంచెలలో బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు. రహదారులను మూసి వేయడంతో స్థానికులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. కిలో మీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అవుతోంది. ఢిల్లీ నుంచి పంజాబ్ వెళ్లే రైళ్లను కూడా రైతులు అడ్డుకున్నారు.

Tear gas on Farmers

రైతులపై బాష్పవాయుడు ప్రయోగించేందుకు డ్రోన్లను పోలీసులు ఉపయోగిస్తున్నారు. డ్రోన్లు పంజాబ్ సరిహద్దులోకి రావడంతో ఆ రాష్ట్ర అధికారులు అభ్యంతరం తెలిపారు. ప్రస్తుతం డ్రోన్ల కదలికలు కనిపించడం లేదని డిప్యూటీ కమిషనర్ సౌకత్ అహ్మద్ పేర్కొన్నారు. రైతులు పండించిన పంటలకు మద్దతు ధరపై చట్టం చేయడంతో ఇతర సమస్యలను పరిష్కరించాలని రైతులు డిమాండ్ చేశారు. దీంతో రైతులు మంగళవారం ఢిల్లీ చలో కార్యక్రమానికి పిలుపునిచ్చారు. నిన్న ఢిల్లీ సరిహద్దుల్లో రణరంగమైన విషయం తెలిసిందే. పోలీసులు, రైతుల మధ్య పలుచోట్ల ఘర్షణ వాతావరణం నెలకొంది. రైతులను ఆపేందుకు పోలీసులు బాష్పవాయుడు, టియర్ గ్యాస్‌ను ప్రయోగించారు. టియర్ గ్యాస్ కోసం డోన్ల వాడడ ఇదే తొలి సారి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News