Thursday, January 23, 2025

దుల్కర్ కంట కన్నీరు..వీడియో ఎందుకు డెలిట్ చేశాడు(వైరల్ వీడియో)

- Advertisement -
- Advertisement -

న్యూస్ డెస్క్: బహుభాషా నటుడు, మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి తనయుడిగా సినిమా ఇండస్ట్రీకి పరిచయమైనప్పటికీ తన అసమాన నటనా ప్రతిభతో వివిద భాషలలో నటుడిగా తనను తాను నిరూపించుకున్నాడు దుల్కర్ సల్మాన్. మహానటి, సీతారామం చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకూ చేరువయ్యాడు. అయితే తాజాగా..దుల్కర్ తన సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్టు చేసిన ఒక సెల్ఫీ వీడియో సంచలనం సృష్టించింది. ఆదివారం రాత్రి దుల్కర్ ఈ వీడియోను పోస్టు చేసి కొద్ది నిమిషాల్లోనే దాన్ని తొలగించడంతో ఆయన అభిమానుల్లో కలవరం సృష్టిస్తోంది. దుల్కర్ కంట్లో నీళ్లు చూసి అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అసలు ఏముంది ఆ వీడియోలో&

ఒక సంఘటన కారణంగా తాను నిద్రలేని రాత్రులు గడుపుతున్నానంటూ దుల్కర్ ఆ తొలగించిన వీడియోలో తెలిపాడు. తాను కొద్ది క్షణాలు కూడా నిద్రపోలేకపతున్నానని చెప్పుకొచ్చాడు. తన జీవితంలో ఇలాంటి సంఘటన తొలిసారి అనుభవించానని, ఆ తర్వాత పరిస్థితులు మారిపోయాయని తెలిపాడు. దాన్ని తన మనసులోనుంచి చెరిపేయలేకపోతున్నానని అతను చెప్పాడు. దీని గురించి ఇంకా చెప్పాలని అనుకుంటున్నప్పటికీ చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నానంటూ అతను ఆవేదన వ్యక్తం చేశాడు.

అసలు ఏం జరిగింది&ఆ చెప్పలేని విషయం ఏమిటి..ఎందుకు చెప్పలేకపోతున్నాడు..వంటి అనేక సందేహాలు నెటిజన్లను పట్టిపీడిస్తున్నాయి. ఇది తన రాబోయే చిత్రానికి సంబంధించిన పబ్లిసిటీ స్టంటా అన్న సందేహం కూడా కొందరిలో వ్యక్తమవుతోంది. దుల్కర్ ఏదైనా అనారోగ్య సమస్యతో బాధపడుతున్నాడా అన్న ఆందోళన కూడా అభిమానుల్లో వ్యక్తమవుతోంది. మొత్తానికి ఈ వీడియో ద్వారా అభిమానుల్లో గందరగోళం నింపిన దుల్కర్ దాన్ని ఎలా తొలగిస్తాడో వేచి చూడాల్సిందే.

దుల్కర్ తాజా చిత్రం కింగ్ ఆఫ్ కోతా చిత్రం టీజర్ ఇటీవలే విడుదలైంది. ఇందులో గ్యాంగ్‌స్టర్ పాత్రలో దుల్కర్ నటిస్తున్నట్లు టీజర్‌ను బట్టి తెలుస్తోంది. మలయాళంలో నిర్మాణం జరుపుకుంటున్న ఈ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ భాషలలో కూడా విడుదలయ్యే అవకాశం ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News