Monday, December 23, 2024

ప్రపంచవ్యాప్తంగా లక్షమంది టెకీల ఉద్యోగాలు హుళక్కి

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా టెకీలకు జనవరి నెల అత్యంత దురదృష్టకరమైనదిగా చెప్పవచ్చు. దాదాపు లక్ష మంది సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు తమ ఉద్యోగాలు ఒక్క జనవరిలోనే కోల్పాయారు. వీరిలో అత్యధికులు అమేజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్, సేల్స్‌ఫోర్స్ తదితర సంస్థలలో పనిచేస్తున్నవారే. ప్రపంచవాప్తంగా 288 కంఎపీలకు పైగా ఉద్యోగాలపై వేటు వేశాయి. సగటున రోజుకు 3,300 మంది టెక్ ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోయారని చెప్పవచ్చు. ఆపిల్‌ని మినహాయిస్తే మిగిలిన బడా కంపెనీలన్నీ తమ ఉద్యోగాలపై వేటు వేశాయి. అమేజాన్‌లో 18,000, గూగుల్‌లో 12,000మైక్రోసాఫ్ట్‌లో 10,000 ఉద్యోగ కోతలు ఒక్క జనవరిలోనే జరిగాయి.

సేల్స్‌ఫోర్స్‌లో 7,000 మంది, ఐబిఎంలో 3,900 మంది, ఎస్‌ఎపిలో 3,000 మంది జనవరిలో ఉద్యోగాలు కల్పోయారు. లేఆఫ్స్ ట్రాకింగ్ సైట్ లేఆఫ్స్.ఫై తెలియచేసిన వివరాల ప్రకారం 2022లో వెయ్యి కంపెనీలకు చెందిన 1,54,336 మంది ఉద్యోగులపై వేటు పడింది. దీని ప్రకారం చూస్తే ఇప్పటివరకు మొత్తం 2.5 లక్ష మందికిపైగా టెక్ ఉద్యోగులు గత ఏడాది నుంచి ఉద్యోగాలు కోల్పోయారు. ఎద్‌టెక్ దిగ్గజం బైజూస్ తన ఇంజనీరింగ్ టీమ్స్‌కు చెందిన ఉద్యోగులలో 15 శాతం మందిని అంటే దాదాపు వెయ్యి మందిని ఇళ్లకు పంపేందుకు సిద్ధమైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News