Friday, November 22, 2024

చాట్‌జిజిటి ఫౌండర్ సవాలు స్వీకరించిన టెక్ మహీంద్రా సిఇఓ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: కృత్రిమ మేధపై ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. చాట్ జిపిటి వచ్చిన తర్వాత ఈ రంగంలో పరిశోధనలు మరింత ఊపందుకున్నాయి. ఈ తరుణంలో చాట్‌జిపిటిని అభివృద్ధి చేసిన ఓపెన్‌ఎఇ కంపెనీ సిఇఓ శామ్ ఆల్ట్‌మన్ భారత్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా గూగుల్ ఇండియా మాజీ ఉపాధ్యక్షుడు రంజన్ ఆనందన్ ఆల్ట్‌మన్‌ను ఓ ఆసక్తికరమైన ప్రశ్న వేశారు. భారత్‌లో అంకుర సంస్థలకు అనువైన వాతావరణం ఉందని రంజన్ అన్నారు. వీటిలో ఏదైనా స్టార్టప్ చాట్‌జిపిటి తరహా ‘ఫౌండేషన్ మోడల్’ను అభివృద్ధి చేసే అవకాశం ఉందా? అనిఆల్ట్‌మన్‌ను ఆయన ప్రశ్నించారు. దీనికి ఆల్ట్‌మన్ బదులిస్తూ ఫౌండేషనల్ మోడల్స్‌ను అభివృద్ధి చేయడంలో తమతో పోటీ పడడం వృథా అని అభిప్రాయపడ్డారు. ఒక వేళ ప్రయత్నించినా నిరాశాజనక ఫలితాలే అందుకుంటారంటూ ఒక రకంగా సవాలు విసిరారు.

పరోక్షంగా చాట్‌జిపిటి తరహా మోడల్స్‌ను అభివృద్ధి చేయడం భారత స్టార్టప్స్‌కు సాధ్యం కాకపోవచ్చని అభిప్రాయపడ్డారు. దీనిపై తాజాగా టెక్ మహీంద్రా సిఇఓ సిపి గుర్నానీ స్పందించారు. తమతో పోటీపడడం వల్ల భారత కంపెనీలు నిరాశాజనకమైన ఫలితాలే అందుకుంటాయనిఆల్ట్‌మాన్ అంటున్నారని, దీన్ని ఓ సిఇఓ విసిరిన సవాలుగా భావిస్తున్నానని అన్నారు. మరో సిఇఓనైన తాను ఆ సవాలును స్వీకరిస్తున్నానని ట్వీట్‌చేశారు. మరో వైపు రంజన్ ఆనందన్ కూడా ఆల్ట్‌మన్ వ్యాఖ్యలపై స్పందించారు. భారత పారిశ్రామికవేత్తలను ఎప్పటికీ తక్కువ అంచనా వేయవద్దని చరిత్ర చెబుతోందన్నారు. ఏది ఏమయినప్పటికీ చాట్‌జిపిటి తరహా మోడల్స్‌ను అభివృద్ధి చేసేందుకు ప్రయత్నిస్తామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News