- Advertisement -
హైదరాబాద్: క్రికెట్ ఆడుతూ ఓ యువ టెక్కీ గుండెపోటుతో మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. విశాఖపట్నం జిల్లా పెద్దగంట్యాడ మండలం మీంది గ్రామానికి చెందిన కాశిరెడ్డి సంజయ్ భార్గవ్ (25) సాఫ్ట్వేర్ ఇంజినీర్. టీసీఎస్‌లో ఉద్యోగం చేస్తూ గచ్చిబౌలిలోని గౌలిదొడ్డిలోని ఓ ప్రైవేట్ హాస్టల్లో ఉంటున్నాడు.
గచ్చిబౌలి నుంచి తన స్నేహితులు దిలీప్, బాలప్రదీప్ అజయ్, తేజకిరణ్, ఆదిత్యలతో కలిసి ఘట్టుపల్లిలోని క్రికెట్ స్టేడియానికి వచ్చాడు. అయితే మధ్యాహ్నం క్రికెట్ ఆడుతుండగా తలనొప్పి రావడంతో ఆట మధ్యలో పక్కనే కూర్చోవాల్సి వచ్చింది. ఆ తర్వాత అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -