Thursday, January 23, 2025

9వ ఫ్లోర్ నుంచి కిందపడి టెక్కీ మృతి…. ఆత్మహత్య?

- Advertisement -
- Advertisement -

Four family dead in hotel in Nizamabad

లక్నో: భారీ వర్షం కురుస్తుండగా ఓ టెక్కీ తొమ్మిదో ఫ్లోర్ నుంచి కిందపడి మృతి చెందిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం నోయిడాలో జరిగింది. ఆత్మహత్య చేసుకున్నాడా? లేక ప్రమాదవశాత్తు జరిగిందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఎంఎన్సీ కంపెనీలో జాబ్ రావడంతో ఓ టెక్కీ ఈ మధ్యనే బెంగళూరు నుంచి నోయిడాకు మకాం మార్చాడు. గ్రాండ్ ఓమాక్సీ సోసైటీలోని సెక్టార్ 93బిలో ప్లాట్ అద్దెకు తీసుకొని ఎంఎన్‌సి కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. ఓ వ్యక్తి కిందపడిపోవడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పరమాన్స్ అనే పోలీస్ అధికారి తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆత్మహత్య చేసుకున్నాడా? లేక ప్రమాదవశాత్తూ పైనుంచి కిందపడ్డాడా? అనే విషయంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి కుటుంబ సభ్యులు, స్నేహితులకు సమాచారం ఇచ్చారు. బాధితుడు గత కొన్ని రోజులు సమస్యలతో బాధపడుతున్నట్టు గుర్తించామని పోలీసులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News