మన తెలంగాణ/హైదరాబాద్ : బిఆర్‌ఎస్ అధినేత, సిఎం కెసిఆర్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. ఎన్నికల ప్రచార సభలకు వెళ్తుండగా సాంకేతిక స మస్య తలెత్తింది. అయిన కాసేపటికే ఫైలట్ సమస్యను గుర్తించాడు. దీంతో ఆలస్యం చేయకుండా హెలికాప్టర్‌ను సురక్షితంగా ఎర్రవల్లిలోని కెసిఆర్ వ్యవసాయ క్షేత్రంలో అత్యవసర ల్యాండింగ్ చేశారు. విషయం తెలుసుకున్న బిఆర్‌ఎస్ శ్రేణులు ఆందోళనకు గురయ్యారు. క్షేమంగా హెలికాప్టర్ ల్యాండ్ కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సిఎం కెసిఆర్ సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. బిఆర్‌ఎస్ అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహిస్తున్నారు.
ఈ క్రమంలోనే సోమవారం ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని దేవరకద్ర, మక్తల్, నారాయణపేట, గద్వాల నియోజకవర్గాల్లోని ప్రజా ఆశీర్వాద సభలకు కెసిఆర్ హాజరు కావాల్సి ఉం ది. అందులో భాగంగా సోమవారం మధ్యాహ్నం ఎర్రవల్లి ఫాం హౌజ్ నుంచి కెసిఆర్ హెలికాప్టర్‌లో దేవరకద్రకు బయల్దేరారు. టేకాప్ అయిన కాసేపటికే సాంకేతి క సమస్య తలెత్తడంతో పైలట్ అప్రమత్తమయ్యారు. వెంటనే హెలికాప్టర్‌ను ల్యాం డింగ్ చేశారు. దీంతో ఏవియేషన్ అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. మరో హెలికాప్టర్ రాగానే సిఎం యథావిథిగా దేవరకద్ర ప్రచార సభకు వెళ్లారు.