Wednesday, January 22, 2025

సిఎం హెలికాప్టర్ లో సాంకేతిక లోపం

- Advertisement -
- Advertisement -

ముఖ్యమంత్రి కేసీఆర్ పయనిస్తున్న హెలికాప్టర్ లో సాంకేతిక లోపం తలెత్తింది. పైలట్ సకాలంలో గుర్తించి, వెనక్కు మళ్లించడంతో ప్రమాదం తప్పింది. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి కేసీఆర్ తన హెలికాప్టర్లో బయల్దేరిన కాసేపటికే, పైలట్ సాంకేతిక లోపాన్ని గుర్తించారు.

ఈ రోజు ముఖ్యమంత్రి నాలుగు సభలలో పాల్గొనాల్సి ఉంది. ఇందులోభాగంగా దేవరకద్రకు వెళ్తుండగా, హెలికాప్టర్ లో సాంకేతిక లోపం బయటపడినట్లు తెలిసింది. ముఖ్యమంత్రి చాలా రోజులుగా ఏడు సీట్లున్నఈ హెలికాప్టర్ నే వినియోగిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News