Monday, January 20, 2025

ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌లో సాంకేతిక లోపం పట్టాలపై నిలిచిపోయిన రైలు

- Advertisement -
- Advertisement -

సికింద్రాబాద్ నుంచి కాగజ్‌నగర్‌కు వెళ్తున్న ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ఈ రైలు వరంగల్ జిల్లా పరిధిలోని హాసన్‌పర్తి వద్ద నిలిచిపోయింది. మార్గమధ్యలో ఈ రైలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆఫీసులు, కాలేజీలు, పరీక్షలు రాసేందుకు వెళ్తున్న వారు ఆందోళనకు గురవుతున్నారు. దీంతోపాటు అదే రూట్‌లో వెళ్లే పలు రైళ్ల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. లోకో పైలట్ సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే టెక్నీషియన్లు సాంకేతిక లోపం తలెత్తిన ఇంజన్‌ను పరిశీలించారు. సమస్య పరిష్కారం కాకపోవడంతో ఆ ఇంజన్ స్థానంలో మరో ఇంజన్ అమర్చడంతో ఆ రైలు అక్కడి నుంచి కదిలింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News