Friday, December 20, 2024

ముంబై వెళ్లాల్సిన విమానంలో సాంకేతిక లోపం

- Advertisement -
- Advertisement -

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి ముంబై వెళ్లాల్సిన ఇండిగో విమానం (6E5099) ఆలస్యం అయింది. మధ్యాహ్నం 2:30 గంటలకు ముంబై వెళ్లాల్సిన విమానంలో సాంకేతికలోపం తలెత్తింది. విమానంలోని ఇంజన్‌లో ఓవర్ హీట్ సమస్య రావడంతో ఎసి సమస్య మొదలై విమానం అలస్యం అయింది. కాగా, ఈ విమానంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, దీపాదాస్ మున్షీ, మంత్రి పొన్నం ప్రభాకర్ ఇంకా ప్రముఖులు ఉన్నారు. ముంబై వెళ్లేందుకు వారు ఆ విమానం ఎక్కారు. ముంబైలో రాహుల్ న్యాయ్ యాత్ర ముగింపు సభకు వెళ్లేందుకు విమానం ఎక్కగా సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో సుమారు గంట నుంచి రెండుగంటల పాటు విమానంలోనే సిఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ఉండిపోయారు. అనంతరం సాంకేతిక సమస్యలను పునరుద్ధరించడంతో ఆ విమానం ముంబై బయలుదేరి వెళ్లింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News