Saturday, November 16, 2024

రైల్వే టికెట్ బుకింగ్‌కు అంతరాయం

- Advertisement -
- Advertisement -

ఐఆర్‌సిటిసి వెబ్‌సైట్‌లో నాలుగు గంటల పాటు సాంకేతిక సమస్య
మనతెలంగాణ/ హైదరాబాద్ : ప్రముఖ రైల్వే టికెట్ బుకింగ్ వెబ్‌సైట్ ఐఆర్‌సిటిసిలో మంగళవారం ఉద యం 8 గంటల నుంచి తలెత్తిన సాంకేతిక సమస్య కారణంగా టికెట్ బుకింగ్ సేవల్లో అంతరాయం ఏర్పడింది. నాలుగు గంటల తరువాత ఈ సైట్‌ను పునరుద్ధరించిన ట్టు ఐఆర్‌సిటిసి తన అధికారిక ట్విట్టర్ అకౌంట్ ద్వారా వెల్లడించింది. ఆ నాలుగు గంటల పాటు తమ వెబ్‌సై ట్, యాప్‌లో టికెట్ బుకింగ్ సర్వీసెస్ అందుబాటులో లేవని పేర్కొంది. ఈ సమస్య పరిష్కారానికి సిఆర్‌ఐఎస్ సాంకేతిక బృందం తీవ్రంగా కృషి చేసిందని ఐఆర్‌సిటిసి తెలిపింది. ఈ నాలుగు గంటల పాటు అమెజాన్, మేక్‌మైట్రిప్ వంటి యాప్‌ల ద్వారా ప్రయాణికులు టి కెట్లు బుక్ చేసుకోవచ్చని ఐఆర్‌సిటిసి తెలిపింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉద యం 10 గంటలకు ఎసి తరగతి (2ఏ/3ఏ/సిసి/ఈసి/3ఈ) ఉద యం 11:00 గంటలకు నాన్ ఏసి తరగతికి (ఎస్‌ఎల్/ఎఫ్‌సి/2ఎస్) కోసం తత్కాల్ బుకింగ్స్ ప్రారంభమవ్వ గా ఈ సమస్య కారణంగా చాలా మంది టికెట్లు బుక్ చేసుకోలేదని అధికారులు తెలిపారు.
ఫిర్యాదుల వెల్లువ..
టికెట్ బుకింగ్ సమస్యపై ప్రయాణికులు ఐఆర్‌సిటిసికి ఫిర్యాదు చేశారు. దయచేసి వీలైనంత త్వరగా ఈ సమస్యను పరిష్కరించండి. టికెట్ బుకింగ్ కోసం వెబ్‌సైట్ లో లాగిన్ అవ్వగా టెక్నికల్ ప్లాబ్లమ్ చూపిస్తోంది. డ బ్బులు కట్ అయినా టికెట్ మాత్రం బుక్ కావడం లేద ని వినియోగదారులు ఫిర్యాదు చేశారు. వినియోగదారులు 14646, 0755-6610661, 0755-4090600 లను సంప్రదించాలని ఐఆర్‌సిటిసి సూచించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News