Monday, December 23, 2024

న్యూయార్క్ బయల్దేరిన విమానంలో సాంకేతిక సమస్య

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ముంబై నుంచి న్యూయార్క్ కు బయల్దేరిన విమానం సాంకేతిక సమస్య కారణంగా వెనక్కి తిరిగి వచ్చేసింది. ఎయిర్ ఇండియాకు చెందిన ఏఐ 119 విమానం మంగళవారం తెల్లవారు జామున 2.19 గంటలకు ముంబై లోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి న్యూయార్క్ లోని జాన్ ఎఫ్ కెనడీ విమానాశ్రయానికి బయలుదేరింది. అయితే విమానం గాలిలోకి ఎగిరిన కాసేపటికి సాంకేతిక సమస్య తలెత్తింది.దీంతో ప్రయాణికులు , సిబ్బంది భద్రత దృష్టా విమానాన్ని ముందు జాగ్రత్తగా తిరిగి ముంబై మళ్లించినట్టు సంబంధిత అధికారులు తెలిపారు. ముంబైలో విమానం సురక్షితంగా ల్యాండ్ అయినట్టు తెలిపారు. వేరే విమానంలో వారందరినీ పంపించే ఏర్పాట్లు చేస్తున్నట్టు వెల్లడించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News