హైదరాబాద్ : తెలంగాణలో ఎస్‌ఐ, పోలీసు కానిస్టేబుల్ స్థాయి నియామక ప్రక్రియలో భాగంగా సాంకేతిక విభాగాలకు సంబంధించిన తుది పరీక్షల షెడ్యూలును పోలీసు నియామక మండలి తాజాగా విడుదల చేసింది. రాతపరీక్షలు మార్చి 11న జరగనున్నాయి. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు నియామక మండలి.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పరీక్ష కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి చేసింది. ఐటీ అండ్ కమ్యూనికేషన్స్ విభాగం ఎస్‌ఐ తుది రాతపరీక్ష మార్చి 11న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, ఫింగర్ ప్రింట్ బ్యూరో (ఎఫ్‌పీబీ) ఏఎస్‌ఐ తుది రాతపరీక్ష అదే రోజు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్ర 5.30 గంటల వరకు జరగనుంది.
అభ్యర్థులు మార్చి 6న ఉదయం 8 గంటల నుంచి మార్చి 9న రాత్రి 12 గంటల వరకు టీఎస్‌ఎల్‌పీఆర్‌బీకి సంబంధించిన వెబ్‌సైట్ నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాలని మండలి ఛైర్మన్ వి.వి.శ్రీనివాసరావు ఒక ప్రకటనలో సూచించారు. హాల్‌టికెట్ డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత పాస్‌పోర్టు సైజ్ ఫొటో అతికించుకోవాలి. హాల్‌టికెట్ డౌన్‌లోడ్‌లో ఒకవేళ ఏమైనా ఇబ్బందులు ఎదురైతే 93937 11110 లేదా 93910 05006 నంబర్లలో సంప్రదించవచ్చు. ఐటీ అండ్ సీవో ఎస్‌ఐ, ఎఫ్‌పీబీ ఏఎస్‌ఐ తుది రాతపరీక్షకు సంబంధించిన మరో రెండు పేపర్ల హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకునే తేదీలను మళ్లీ ప్రకటిస్తామని ఛైర్మన్ వివరించారు.