Wednesday, January 8, 2025

మార్కెట్లోకి ప్రీమియం ఫోన్..

- Advertisement -
- Advertisement -

చైనీస్ స్మార్ట్‌ఫోన్ కంపెనీ టెక్నో భారతదేశ మార్కెట్లో తమ ఫాంటమ్ సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేయబోతోంది. ఈ ఏడాదిలోనే ఫోల్డబుల్ ఫాంటమ్ V2 సిరీస్‌కు చెందిన ఫాంటమ్ V2 ఫోల్డ్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ శక్తివంతమైన, అద్భుతమైన బ్యాటరీని కలిగి ఉంటుంది. అలాగే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లు కూడా ఉండనున్నాయి. ఇక ఈ ఫోన్ పూర్తి వివరాలు తెలుసుకుందాం.

టెక్నో ఫాంటమ్ వి2 ఫోల్డ్ ఫీచర్లు

టెక్నో ఫాంటమ్ V2 ఫోల్డ్ మొబైల్ 7.85 అంగుళాల ప్రధాన డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. టెక్నో ఫాంటమ్ V2 ఫోల్డ్‌లో మీడియా టెక్ డైమెన్సిటీ 9000+ ప్రాసెసర్ తో అమర్చారు. కాగా, ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది. అద్భుతమైన ఫోటోల తీయడానికి .. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 50 MP + 50 MP + 50 MP వెనుక కెమెరా, ఇక సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 32MP + 32 MP ఫ్రంట్ కెమెరా ఉంటుంది. టెక్నో ఫాంటమ్ V2 ఫోల్డ్ 12GB RAM + 512GB స్టోరేజ్ వేరియంట్‌లను కలిగి ఉంటుంది. ఇక ఈ స్మార్ట్ ఫోన్ బ్యాటరీ 5750 mAh కలిగి ఉంటుంది. ఇది 70W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్, అదేవిధంగా 15W వైర్‌లెస్ ఛార్జింగ్ తో వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసిన తర్వాత దీని అమెజాన్ లో కొనుగోలు చేయవచ్చు. కాగా, టెక్నో ఫాంటమ్ వి2 ఫోల్డ్ ధర రూ. 92,200 గా ఉండనున్నట్లు తెలుస్తోంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News