జర్మనీకి చెందిన అకోమ్ గ్రూప్ ప్రతినిధులతో జాయింట్ సిపి రంగనాథ్ భేటీ
లేటెస్ట్ టెక్నాలజీతో అధిక శబ్దం చేసే వాహనాల గుర్తింపు
మనతెలంగాణ, సిటిబ్యూరోః అధిక శబ్ధం చేసే వాహనాలను గుర్తించేందుకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు జర్మనీ టెక్నాలజీతో చెక్‌పెట్టనున్నారు. ఈ మేరకు జర్మనీ ప్రతినిధులతో కలిసి ట్రాఫిక్ జాయింట్ పోలీస్ కమిషనర్ ఎవి రంగనాథ్ తన కార్యాలయంలో బుధవారం సమావేశమయ్యారు. నగరంలోని అధిక శబ్దం చేస్తున్న వాహనదారులను కంట్రోల్ చేసేందుకు జర్మనీకి చెందిన అకోమ్ గ్రూప్ తయారు చేసిన టెక్నాలజీని వాడనున్నారు. ఈ మేరకు అసెంబ్లీ సిగ్నల్ వద్ద ట్రయల్ రన్ నిర్వహించారు. మున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని పోలీసులు తెలిపారు. రద్దీ ప్రదేశాలలో వాహనదారులకు ఇబ్బంది కలిగేలా సౌండ్ చేసే వాహనాలను పోలీసులు నియంత్రించనున్నారు. ఇలాంటి వాహనాలను కనిపెట్టేందుకు అత్యాధునిక టెక్నాలజీని వాడి వాహనదారులపై చర్యలు తీసుకోనున్నారు.