Tuesday, April 8, 2025

రోడ్డు ప్రమాదంలో తీగల కృష్ణారెడ్డి మనవడు మృతి

- Advertisement -
- Advertisement -

మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి మనవడు కనిష్క్ రెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. గురువారం రాత్రి హైదరాబాద్ శివారులోని గొళ్లపల్లి కలాన్ వద్ద ఓఆర్‌ఆర్ పై లారీని వెనుక నుండి కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కనిష్క్ రెడ్డి తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన కనిష్క్ రెడ్డిని స్థానికులు చికిత్స నిమిత్తం యశోద ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కనిష్క్ రెడ్డి శుక్రవారం మృతి చెందాడు. ఈ అనూహ్య ఘటన తో  తీగల కృష్ణారెడ్డి ఇంట విషాద ఛాయలు నెలకొన్నాయి. రోడ్డు ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News