Sunday, February 23, 2025

కాంగ్రెస్ లోకి తీగల కృష్ణారెడ్డి, అనితారెడ్డి

- Advertisement -
- Advertisement -

మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, ఆయన కోడలు, రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్ పర్సన్ అనితారెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి దీపా దాస్ మున్షీ సమక్షంలో వారు సోమవారం కాంగ్రెస్ లో చేరారు. ఇప్పటివరకూ బీఆర్ఎస్ లో కొనసాగిన తీగల కృష్ణారెడ్డి కొంతకాలంగా పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉన్నారు.

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రేవంత్ రెడ్డిని కలవడంతో త్వరలో ఆయన కాంగ్రెస్ లో చేరతారన్న వార్తలు జోరందుకున్నాయి. తాజాగా ఆ వార్తలను నిజం చేస్తూ ఆయన తన కోడలితో సహా హస్తం గూటికి చేరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News