ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి, మాధవరం కృష్ణారావు, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి భేటీ అయ్యారు. సోమవారం హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని చంద్రబాబు నివాసంలో వారు ఆయనను కలిశారు. ఈ సందర్భంగా తీగల కృష్ణారెడ్డి తాను టీడీపీలో చేరనున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం ఆయన బీఆర్‌ఎస్ పార్టీలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్‌తో తన రాజకీయ ప్రస్థానం మొదలైందని గుర్తు చేసిన ఆయన హైదరాబాద్ అభివృద్ధి చేసింది వంద శాతం చంద్రబాబు అని అన్నారు. తెలంగాణలో టీడీపీ పాలన మళ్లీ రావాల్సిన అవసరం ఉందని తెలిపారు.
చంద్రబును కలిసిన మల్ల్ల్లారెడ్డి : చంద్రబాబును కలిసి మల్లారెడ్డి తన మనుమరాలు శ్రేయారెడ్డి పెళ్లికి సీఎంను ఆహ్వానించారు. గతంలో మల్ల్లారెడ్డి, మాధవరం కృష్ణారావు, తీగల కృష్ణారెడ్డి టీడీపీలో పనిచేసిన విషయం తెలిసిందే. ఆ తరువాత జరిగిన పరిణామాలతో వారు టీడీపీని వీడారు. మల్లారెడ్డి మనుమరావు పెళ్లి కారణంగా చాలా కాలం తరువాత వారు ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబును కలిశారు.