Monday, December 23, 2024

గిరిజన సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక తీజ్ పండుగ

- Advertisement -
- Advertisement -

నల్లగొండ:గిరిజనులు జరుపుకునే ముఖ్యమైన పండుగలు తీజ్ పండుగ ప్రధా నమైనదని , తమ కులంలోని అవివాహితులైన యువతులు జరుపుకునే పండుగ తమ కుల సంప్ర దాయాలకు ప్రతీకని ఎమ్మెల్సీ కోటిరెడ్డి అన్నారు. శనివారం త్రిపురారం మండలంలోని రూప్లా,హర్జ తండాలలో జరిగిన తీజ్ పండుగ వేడుకల్లో ఆయన ము ఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కోటి రెడ్డి మాట్లాడుతూ ప్రజలందరూ సుఖ శాం తులు,పాడిపంటలు, ఆయురారోగ్యాలతో ఉండాలని తొమ్మిది రోజులు ప్రత్యేకంగా అలం కరించిన బుట్టలలో మొలకలు పెంచి, గిరిజన సంస్కృతి, సంప్రదాయాలతో మొక్కులు చెల్లించుకుంటారన్నారు. ఈ కార్యక్రమంలో తిరుమలగిరి (సాగర్) ఎ ంపిపి అంగోత్ భగవాన్ నాయక్, నాయకులు ధన్‌సింగ్ నాయక్, రవి నాయక్, కిట్టు నాయక్,తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News