జమ్మూకశ్మీర్ లోని కథువా జిల్లాలో మూడు రోజులక్రితం అదృశ్యమైన ముగ్గురు టేనేజర్లు శనివారం నాడు మరణించి కన్పించారు. వారిలో 14 ఏళ్ల పిల్లాడు కూడా ఉన్నారు. కథువా జిల్లా టెర్రరిస్ట్ లకు ఒకప్పుడు అడ్డా. కథువా జిల్లాలోని బిల్లావర్ ప్రదేశంలో గత రెండేళ్లుగా పలు టెర్రరిస్ట్ దాడులు జరిగాయి. వారిని యోగేశ్ సింగ్, ధర్సన్ సింగ్, మైనర్ బాలుడు వరుణ్ సింగ్ గా గుర్తించారు. బిలావర్ టౌన్ లో ఓ పెళ్లికి హాజరైన వారు బుధవారం నుంచి జాడ తెలియకుండా పోయారు.
వెంటనే రంగంలోకి దిగిన సైన్యం, పోలీసులు తీవ్రంగా గాలించారు. వారు అడవిలోకి వెళ్లి దారి తప్పినట్లు భావించినట్లు వారి బంధువులు రెండు రోజులక్రితం తెలిపారు. డ్రోన్ సాయంతో ఆడవుల్లో గాలించగా..లోేహే మల్హర్ . అనే ప్రదేశంలో ఓ నీటి గుంటవద్ద .. వారు మరణించి ఉన్నట్లు కన్పించింది. పోస్ట్ మార్టం తర్వాతే వారు ఎలా చనిపోయారో తెలిసే అవకాశం ఉంది. యువకులు ముగ్గురూ బల్లావర్ జిల్లాకు చెందిన వారే. యోగేశ్, దర్శన్ మర్హూన్ ప్రాంతానికి చెందిన వారు కాగా వరుణ్ దెహోటా ప్రదేశానికి చెందిన వాడు.