Monday, December 23, 2024

ఈ ‘పామ్’ తో కలవరం..

- Advertisement -
- Advertisement -

తిరువనంతపురం : నయిగ్లెరియా ఫైలరి అనే ఏకకణ జీవి కేరళలో ఓ బాలుడిలోకి ప్రవేశించి మెదడును తినేసి ప్రాణాలు తీసింది. ఎక్కడపడితే అక్కడ ఉండే ఈ ప్రాణాంతక, ప్రత్యేకించి బ్రెయినాంతక జీవిని సాధారణంగా కిల్లర్ అమోయిబా అంటారు. కేరళలోని అలఫ్పుజా జిల్లాలో పదవ తరగతి చదివే బాబు స్నానం చేసేటప్పుడు తాజా వెచ్చని నీళ్లలో ఎక్కువగా ఉండే ఈ కణజీవి ముక్కులో నుంచి లోపలికి వెళ్లింది. ఆదివారం ఈ జీవి దాడికి గురైనప్పటి నుంచి క్రమేపీ లోపల మెదడు కణజాలం నశిస్తూ పోవడంతో చివరికి శుక్రవారం కన్నుమూశాడు. నిజానికి ఇది విదేశీ ఏకకణ జీవి. ఎక్కువగా తాజా నీరు ఉండే జలాశయాల్లో, నదులలో ఉంటుంది. నేలలో కూడా దాగి ఉంటుంది. నయిగ్లెరియాలోనే ఉండే ఈ జీవి లోపలికి ప్రవేశిస్తే మెదడు చచ్చుబడుతుంది. ఏదో విధంగా మనిషి శరీరంలోకి ఇది చేరితే ఏర్పడే పామ్ అనే శీఘ్రగతి వ్యాధి రోజుల వ్యవధిలోనే ప్రాణాలను తీసేస్తుంది.

పై నుంచి పడే నీళ్ల కింద తలపెట్టిన వారికి ఎక్కువగా ఇది ముక్కులో నుంచి లోపలికి చేరడం జరుగుతుందని అంటువ్యాధుల నివారణ కేంద్రం (సిడిఎస్) నిపుణులు తెలిపారు. స్విమ్మింగ్, డైవింగ్‌కు పాల్పడే వారికి ఎక్కువగా దీని కాటు ఏర్పడుతుంది. ఇది ఉండే నీరు తాగితే ఏమి కాదని వెల్లడించారు. సాధారణంగా మెదడు కణజాలం చాలా సున్నితంగా ఉంటుంది. పరాయి జీవి ఏదైనా లోపలికి చేరితే తినేసి తినేసి దెబ్బతీస్తుంది. ఒక్కసారి దీని ప్రవేశం జరిగితే ఇక ఏమి చేయలేని స్థితి ఏర్పడుతుందని నిపుణులు తెలిపారు. ఈ ఏక కణ జీవి దాడికి గురైన వారికి ముందు తీవ్రస్థాయి తలనొప్పి, మగత , వాంతి తరువాత , మెడ నిక్కబోడ్చుకోవడం, క్రమేపీ ఎవరిని గుర్తు పట్టలేని, మాట్లాడలేని స్థితికి తరువాత కోమా ఏర్పడుతుంది. కేవలం ఐదురోజుల్లోనే ఎక్కువగా మరణం సంభవిస్తుంది. ఇమ్యూనిటి ఎక్కువగా ఉంటే అటువంటి వ్యక్తి 18 రోజుల వరకూ జీవించి ఉండగల్గుతాడు.

.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News