Saturday, December 21, 2024

చెట్టును ఢీకొట్టిన కారు.. బాలుడు దుర్మరణం

- Advertisement -
- Advertisement -

జగిత్యాలః జగిత్యాల రూరల్ మండలం హబ్సీపూర్ గ్రామ శివారులో శుక్రవారం రాత్రి కారు చెట్టుకు ఢీకొన్న సంఘటనలో యేలేటి సాత్విక్‌రెడ్డి (12) అనే బాలుడు దుర్మరణం పాలయ్యాడు. స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. హబ్సీపూర్ గ్రామానికి చెందిన యేలేటి మహిపాల్‌రెడ్డి తన భార్య, కూతురు, కుమారునితో కలిసి కారులో తక్కళ్లపల్లి గ్రామంలో తమ బంధువుల ఇంట్లో జరిగిన శుభకార్యానికి వెళ్లారు. తిరిగి హబ్సీపూర్ వెళ్తుండగా కారుకు అడ్డంగా వచ్చిన కుక్కను తప్పించబోయి రోడ్డు పక్కన ఉన్న తాటి చెట్టుకు కారు ఢీకొట్టింది.

దాంతో కారులో ఉన్న సాత్విక్‌రెడ్డి తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందగా, మహిపాల్‌రెడ్డి, భార్య మౌనిక, కూతురు సహస్రలు ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడ్డారు. రోడ్డు ప్రమాదంలో సాత్విక్‌రెడ్డి మృతి చెందగా కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. ప్రమాద సంఘటన గురించి తెలుసుకున్న ఎంఎల్‌సి జీవన్‌రెడ్డి శనివారం హబ్సీపూర్ వెళ్లి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. జగిత్యాల రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News