Sunday, February 23, 2025

అమ్మవారు ఉందని చెల్లి తల నరికి….

- Advertisement -
- Advertisement -

 

 

జైపూర్: దశమాత అమ్మవారికి పూజ చేస్తుండగా 15 ఏళ్ల బాలిక తనని అమ్మవారు ఆవహించిందని కత్తి పట్టుకొని కుటుంబ సభ్యులను గాయపర్చడంతో పాటు పెద్దనాన్న కుమార్తె తల నరికిన సంఘటన రాజస్థాన్ రాష్ట్రం డూంగర్ పూర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. జింజ్వా ఫాలా గ్రామంలో శంకర్ అనే వ్యక్తి తన కుటుంబ సభ్యులతో కలిసి జీవిస్తున్నాడు. సోమవారం తెల్లవారుజామున తన దశమాత అమ్మవారికి పూజలు చేస్తున్నాడు. పెద్ద సంఖ్యలో గ్రామస్థులు వచ్చి అమ్మవారిని దర్శించుకుని వెళ్లిపోతున్నారు. అమ్మవారి విగ్రహం వద్ద కత్తి తీసుకొని ఇష్టం వచ్చినట్టుగా ఎగరడం, గంతులు వేయడంతో కుటుంబ సభ్యులు ఆపడానికి ప్రయత్నించారు. కత్తితో శంకర్‌తో పాటు కుటుంబ సభ్యులను గాయపర్చడంతో వాళ్లు పారిపోయారు. ఇంట్లోకి శంకర్ అన్న కూతురు పుష్ప(9) తలను నరికేసింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకొని బాలికను అరెస్టు చేసి జువైనల్ హోమ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News