Thursday, September 19, 2024

ఆకట్టుకుంటున్న తేజ ‘మిరాయ్’ బర్త్ డే పోస్టర్

- Advertisement -
- Advertisement -

పాన్ ఇండియా సక్సెస్ ‘హను-మాన్’తో దూసుకుపోతున్న సూపర్ హీరో తేజ సజ్జా నెక్స్ పాన్ ఇండియా మూవీ ‘మిరాయ్’లో అలరించనున్నారు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్న ఈ యాక్షన్- అడ్వెంచర్‌లో తేజ సజ్జా సూపర్ యోధ పాత్రలో కనిపిస్తారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. తేజ సజ్జ పుట్టినరోజు సందర్భంగా బ్రాండ్ న్యూ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.

సినిమాలో హీరో పాత్రలోని కరేజియస్ స్పిరిట్‌ని హైలైట్ చేస్తూ పోస్టర్‌ను అద్భుతంగా చూపించారు. పోస్టర్‌లో తేజ సజ్జ మండుతున్న ఐరన్ రాడ్‌ను పట్టుకుని పైకి చూస్తున్నట్లు టెర్రిఫిక్‌గా కనిపించారు. ప్రమాదకర పరిస్థితిలో చిక్కుకుపోయినప్పటికీ ఇంటెన్స్‌గా వున్నారు. బ్యాక్‌డ్రాప్‌లో వెనుక ఒక పురాతన దేవాలయం ఉంది. ఈ పోస్టర్ ప్రేక్షకులని కట్టిపడేసింది. తేజ సజ్జా చాలా హార్డ్ వర్క్ చేసి సినిమా కోసం బెస్ట్ ఎఫర్ట్ పెడుతున్నారని బర్త్‌డే స్పెషల్ పోస్టర్‌లో స్పష్టంగా కనిపిస్తోంది.

న్యూ వరల్డ్‌ని క్రియేట్ చేయడంలో డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని నైపుణ్యం కనిపిస్తుంది. తేజ సజ్జ, మంచు మనోజ్ పాత్రలను పరిచయం చేసిన ఫస్ట్-లుక్ పోస్టర్లు, గ్లింప్స్‌లు అద్భుతమైన స్పందనతో సినిమాపై భారీ అంచనాలను నెలకొల్పాయి. ఈ కొత్త పోస్టర్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది. ‘మిరాయ్’ని 8 భాషల్లో ఏప్రిల్ 18, 2025న వేసవిలో 2డి, 3డి వర్షన్‌లలో విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News