Sunday, December 22, 2024

‘మిరాయి’ గ్లింప్స్ సూపర్.. సూపర్ యోధుడిగా తేజ సజ్జా

- Advertisement -
- Advertisement -

యంగ్ హీరో తేజ సజ్జా ఇటీవల ‘హను-మాన్‌’ సంచలన విజయంతో సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వేల్ గా వస్తున్న జై హనుమాన్ మూవీని చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మరో క్రేజీ ప్రాజెక్టులో నటిస్తున్నాడు తేజ. గురువారం ఈ మూవీకి సంబంధించిన టైటిల్ తోపాటు గ్లింప్స్ ను మేకర్స్ విడుదల చేశారు. ఈ సినిమాకు మిరాయ్ అనే టైటిల్ ను ఖారారు చేశారు. గ్లింప్స్ మాత్రం ఎవ్వరూ ఊహించని విదంగా హాలీవుడ్ రేంజ్ లో అద్భుతంగా ఉంది. విజువల్స్ సినిమాపై భారీ అంచనాలను పెంచేసింది. ఈ సినిమాలో తేజ సూపర్ యోధగా నటిస్తున్నట్లు తెలుస్తోంది. తేజ లుక్ కూడా అదిరిపోయింది.

భారీ బ‌డ్జెట్‌తో ఈ సినిమాను పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్‌ పాన్ ఇండియాగా మూవీగా నిర్మిస్తున్నారు. ఈగ‌ల్ సినిమా దర్శకుడు కార్తీక్‌ ఘట్టమనేని ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.  వచ్చే ఏడాది ఏప్రిల్ 25న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల చేయనున్నట్లు మేకర్స్ స్పష్టం చేశారు. ఈ సినిమాకు సంబంధించిన నటీనటులతోపాటు పూర్తి వివరాలు త్వరలో వెల్లడించనున్నట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News