- Advertisement -
జైసల్మేర్: రాజస్థాన్ లోని జైసల్మేర్‌లో భారత వాయుసేన (ఐఎఎఫ్)కు చెందిన ఓ తేజస్ యుద్ధ విమానం మంగళవారం కుప్పకూలింది. శిక్షణ కార్యకలాపాల సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు అధికారులు తెలిపారు. పైలట్ అప్రమత్తమై సురక్షితంగానే ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ఈ ప్రమాదానికి కారణాలపై విచారణకు ఆదేశించినట్టు వాయుసేన తెలిపింది.
స్వదేశీ పరిజ్ఞానంతో భారత్ రూపొందించిన యుద్ధ విమానాల్లో తేజస్ ఒకటి. 2016 లో దీన్ని వాయుసేన లోకి చేర్చారు. 2001లో తొలిటెస్ట్ ఫ్లైట్ మొదలు, తేజస్ కూలిపోవడం ఇదే మొదటిసారి. పోఖ్రాన్ ఫైరింగ్ రేంజ్‌లో భారత్ శక్తి పేరిట సైనిక విన్యాసాలు కొనసాగుతోన్న వేళ ఈ ఘటన చోటు చేసుకుంది. కూలిన యుద్ధ విమానం మంటల్లో చిక్కుకుపోవడంతో అగ్ని మాపక సిబ్బంది సహాయక చర్యలు తీసుకున్నారు.
- Advertisement -