Friday, January 10, 2025

తేజస్ ఫైటర్స్‌కు మలేసియాలో డిమాండ్

- Advertisement -
- Advertisement -

Tejas fighters are in demand in Malaysia

న్యూఢిల్లీ : భారతదేశపు ప్రతిష్టాత్మక తేజస్ యుద్ధ విమానం మలేసియా ముచ్చటపడి ఎంచుకుంటోంది. తమ దేశ రక్షణలో ఫైటర్ శ్రేణులలో కీలకంగా తీసుకునేందుకు ఆలోచిస్తోంది. తేజస్ తేలికపాటి యుద్ధ విమానం శక్తి సామర్థాలతో ఈ ఆగ్నేయాసియా దేశం ఈ విమానాలను భారత్ నుంచి సమీకరించుకునే దిశలో చర్చలు చేపట్టింది. ఉభయ దేశాల మధ్య సంప్రదింపులు కీలక దశకు చేరాయి. ఇప్పటివరకూ తమ సైనిక బలగాలకు అందుబాటులో ఉన్న పాతకాలపు యుద్ధ విమానాల స్థానంలో ఈ తేజస్ ఫైటర్లను ప్రవేశపెట్టడం ద్వారా శక్తివంతం కావాలని మలేసియా యోచిస్తోంది. యుద్ధ విమానాలకు సంబంధించి మలేసియాకు చైనా నుంచి జెఎఫ్ 17 జెట్స్, దక్షిణ కొరియా ఎఫ్‌ఎ 50, రష్యా మిగ్ 35, యాక్ 130 ఫైటర్ల విక్రయాలపై భారీ స్థాయిలో బేరసారాల సంప్రదింపులు వివిధ సందర్భాల్లో సాగాయి. ఈ ఆఫర్లన్నింటిని పక్కకు పెట్టి ఇండియాకు చెందిన తేజస్ యుద్ధ విమానాల పట్ల మలేసియా ఎక్కువగా మొగ్గు చూపిందని హిందూస్థాన్ ఎయిరోనాటిక్స్ లిమిటెడ్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఆర్ మాధవన్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

చైనాకు చెందిన జెఎఫ్ 17 తక్కువ ధర ఆఫరు ఉంది. అయితే తేజస్ ఎంకె 1ఎ వేరియంటు సాంకేతికత ముందు ఇది తక్కువ స్థాయిలోనే ఉందని మలేసియా నిర్థారించుకుంది. మలేసియాకు చెందిన అత్యున్నత స్థాయి అధికారులు , నిపుణులు వచ్చే నెలలో భారతదేశానికి వచ్చి తేజస్ సేకరణ ప్రక్రియను మరింత వేగవంతం చేస్తుందని వెల్లడైంది. ఇక మలేసియాలో భారతదేశం తరఫున యుద్ధ విమానాల మరమ్మతు, నిర్వహణ, మరింత అధునాతనం చేసేందుకు ఎంఆర్‌ఒ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని ప్రతిపాదన వెలువడింది. రష్యాకు చెందిన స్యూ 30 ఫైటర్ల దళం బాగోగులకు ఈ కేంద్రం తోడ్పాటు ఉంటుంది. సంబంధిత అంశంపై ఒప్పందం కుదురుతుందని ఆశిస్తున్నట్లు మాధవన్ తెలిపారు. అయితే అక్కడ కొన్ని రాజకీయ మార్పుల ప్రభావాలు ఉంటే ఫలితం వేరే విధంగా ఉంటుందని, దీనిని తాము తేలిగ్గా తీసుకుంటున్నామని వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News