Monday, December 23, 2024

తేజస్ యుద్ధ విమానంలో అత్యాధునిక కంప్యూటర్ అమరిక

- Advertisement -
- Advertisement -

19న విజయవంతంగా తొలి పయనం

న్యూఢిల్లీ : దేశీయంగా అభివృద్ధి పరచి డిజిటల్ ఫ్లైబైవైర్ ఫ్లైట్ కంట్రోల్ కంప్యూటర్ (డిఎఫ్‌సిసి)ని తేజస్ తేలిక రకం యుద్ధ విమానంలో పొందుపరచినట్లు రక్షణ మంత్రిత్వశాఖ మంగళవారం వెల్లడించింది. ఈ విమాన కార్యక్రమంలో ఇది ‘గణనీయమైన పరిణామం’ అని మంత్రిత్వశాఖ పేర్కొన్నది. దేశీయంగా తయారు చేసిన తేజస్ ఒకే ఇంజన్ గల బహుళ ప్రయోజక యుద్ధ విమానం.

అధిక ముప్పు గల గగన వాతావరణంలో నడిచే సామర్థం ఉన్న విమానం తేజస్. గగనతల రక్షణ, సాగర ప్రాంత పర్యవేక్షణ, దాడి బాధ్యతలు చేపట్టగలిగేలా విమానానికి రూపకల్పన జరిగింది. ‘తేజస్ ఎ ంకె1ఎ కార్యక్రమం దిశగా గణనీయ పరిణామంలో డిఎఫ్‌సిసిని ఎల్‌ఎస్‌పి7 ప్రోటోటైప్‌లో సమీకృతం చేసి, సోమవారం (19న) విజయవంతంగా నడపడమైంది’ అని రక్షణ మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది.

తేజస్ ఎంకె1ఎ వెర్షన్ కోసం బెంగళూరులోని ఏరోనాటికల్ అభివృద్ధి సంస్థ (ఎడిఇ) డిఎఫ్‌సిసిని దేశీయంగా అభివృద్ధి చేసింది. తాజా విమానాన్ని నేషనల్ ఫ్లైట్ టెస్ట్ సెంటర్‌కు చెందిన వింగ్ కమాండర్ సిద్ధార్థ్ సింగ్ కెఎంజె (రిటైర్డ్) నడిపారు. తేజస్ ఎంకె1ఎను విజయవంతంగా పరీక్షించినందుకు సంబంధిత బృందాలను రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అభినందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News