Thursday, January 23, 2025

రాహుల్ ‘న్యాయ్ యాత్ర’లో తేజస్వి యాదవ్

- Advertisement -
- Advertisement -

ససారం (బీహార్) : రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్‌జెడి) నేత తేజస్వి యాదవ్ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’లో పాలు పంచుకున్నారు. రాహుల్ సారథ్యంలో సాగుతున్న ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ శుక్రవారం బీహార్‌లోని ససారం జిల్లాలో తిరిగి ప్రారంభమైంది. కాంగ్రెస్ ఎంపి రాహుల్ గాంధీ శుక్రవారం ఉదయం తన యాత్రను పార్టీ జిల్లా కార్యాలయం నుంచి మొదలుపెట్టారు.

యాత్ర కైమూర్ జిల్లాలోని మొహనియా ద్వారా ఉత్తర ప్రదేశ్‌లో ప్రవేశించనున్నది. ససారంలో యాత్ర సమయంలో తేజస్వి యాదవ్, రాహుల్ గాంధీ ఒక ఎస్‌యువి పై కప్పు మీద ఆసీనులు కావడం కనిపించింది. పట్టణంలోని ప్రధాన రోడ్డు పొడుగునా ఎంతో ఉత్సాహంతో సమీకృతమైన జనం వైపు చేతులు ఊపారు. స్థానికలు రోడ్డుకు రెండు వైపుల బారులు తీరి ఊరేగింపును తిలకించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News