పాట్నా: రాష్ట్రీయ జనతా దళ్(ఆర్‌జెడి) అధ్యక్షుడు తేజస్వి యాదవ్ తన ఇంట్లో పనిచేసేవారితో క్రికెట్ ఆడుతూ తీసుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే, బరువు తగ్గించుకోవాలంటూ ప్రధాని నరేంద మోడీ ఇటీవల ఇచ్చిన సలహాను తేజస్వీ పాటిస్తున్నట్లు కనపడుతోందంటూ నెటిజన్లు ట్రోలింగ్ చేయడం గమనార్హం. రాజకీయాల్లోకి ప్రవేశించకముందు క్రికెట్‌నే కెరీర్‌గా మలుచుకున్న తేజస్వి గతంలో ఢిల్లీ డేర్‌డెవిల్స్ టీమ్‌లో ఐపిఎల్ కాంట్రాక్టుకు కూడా దక్కించుకున్నారు. చాలా ఏళ్ల తర్వాత తన చేతులు బ్యాట్ పట్టుకోవడం ఆనందంగా ఉందంటూ తేజస్వి ట్వీట్ చేశారు. తన తోటి ఆటగాళ్లు తన ఇంటి డ్రైవర్, వంటమనిషి, స్వీపర్, తోటమాలి, సంరక్షకులు అయితే ఆ తృప్తే వేరని ఆయన పేర్కొన్నారు. జీవితమైనా ఆటైనా గెలుపే ధ్యేయంగా ఎల్లప్పుడూ ఆడాలని, మనసులో సరైన ప్రణాళిక ఏర్పర్చుకుంటే రణక్షేత్రంలో మెరుగ్గా ప్రదర్శించగలమంటూ ఆయన ట్వీట్ చేశారు. ఇటీవల జరిగిన బీహార్ అసెంబ్లీ భవనాల శతజయంతి ఉత్సవంలో అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకునిగా పాల్గొన్న తేజస్వి లిఖితపూర్వక ప్రసంగాన్ని కూడా సరిగ్గా చదవలేకపోయారు. అదే కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోడీ సభ ముగిసిన తర్వాత తేజస్వితో మాట్లాడుతూ.. బరువు తగ్గించుకో అంటూ సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది. తన తండ్రి వయసులో ఉన్న ప్రధాని మోడీ సున్నితంగా చేసిన మందలింపు వాక్యాలు తేజస్విలో స్థూలకాయాన్ని తగ్గించుకునే పనికి పురిగొల్పాయని ఆయన సన్నిహితులు భావిస్తున్నారు.
Life or game, one should always play to win. The more you plan in head, the more you perform on field.
Pleasure to try hands on bat & ball after ages. It becomes more satisfying when driver, cook, sweeper, gardener & care takers are your playmates and keen to hit & bowl you out. pic.twitter.com/ChvK9evzi2
— Tejashwi Yadav (@yadavtejashwi) July 17, 2022
Tejashwi Yadav plays cricket at his home