- Advertisement -
పాట్నా: ఆర్జెడి అధినేత లాలూప్రసాద్ చిన్నకుమారుడు, బీహార్ అసెంబ్లీలో ప్రతిపక్షనేత తేజస్వీయాదవ్(32) త్వరలోనే పెళ్లి చేసుకోనున్నారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. గురువారం ఢిల్లీలో నిశ్చితార్థం(సగాయి) జరగనున్నదని, కుటుంబసభ్యులంతా ఢిల్లీ చేరుకుంటున్నారని ఆ వర్గాలు తెలిపాయి. అయితే, వధువు ఎవరన్నది రహస్యంగా ఉంచారు. లాలూరబ్రీ దంపతులకు మొత్తం 9మంది సంతానం కాగా, తేజస్వీమినహా మిగతావారి పెళ్లిళ్లు జరిగాయి. తమ నేతకు నిశ్చితార్థం సందర్భంగా మనేర్ ఎంఎల్ఎ భాయీ వీరేంద్ర తన నియోజకవర్గంలో మిఠాయిలు పంచిపెట్టారు. కొవిడ్ మరోసారి విస్తరిస్తున్న నేపథ్యంలో నిశ్చితార్థాన్ని కొద్దిమంది సన్నిహితుల మధ్యే నిర్వహించాలని తేజస్వీ సూచించినట్టు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. పెళ్లి కూడా త్వరలోనే ఉంటుందని పేర్కొన్నాయి.
- Advertisement -